విద్యార్థులతో స్థానిక భాషలోనే మాట్లాడండి: ఏఐసీటీఈ
x

విద్యార్థులతో స్థానిక భాషలోనే మాట్లాడండి: ఏఐసీటీఈ

విద్యార్థులతో స్థానిక భాషలోనే మాట్లాడాలని ఏఐసీటీఈ సూచించింది. దీనివల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుందని పేర్కొంది.


ఇప్పుడు కాలం మొత్తం మారింది. మాతృభాషలో కళాశాలలు(కాలేజ్) పాఠశాలల్లో(స్కూల్లు) మాట్లాడడం చిన్నతనంగా భావిస్తున్నారు. విద్యార్థులు కూడా స్థానిక భాషలో మాట్లాడితే ఎవరూ ఏమనకుంటారో అని దాదాపుగా మౌనంగానే ఉంటున్నారు. తరగతి లో కూడా ఈతరహ వాతావరణమే ఉంటుంది.

ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మాత్రం ఇక నుంచి అలా ఉండకూదని ఏఐసీటీఈ( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తాజాగా జారీ చేసిన సర్క్యూలర్ లో వివరించింది. విద్యార్థులతో స్థానిక భాషలోనే మాట్లాడాలని అందులో సూచించింది. ఇంజనీరింగ్ కోర్సులో స్థానిక భాష నేపథ్యం ఉన్న విద్యార్థులు కాన్సెప్ట్ లను బాగా అర్థం చేసుకోవడానికి అధ్యాపకులు( టీచర్లు) స్థానిక భాషలో మాట్లాడడం ఉపకరిస్తుందని తెలిపింది.
తాజాగా జారీ చేసిన సర్క్యూలర్ లో ‘ ఇతర భాషలపై పట్టులేని మిలియన్ల మంది విద్యార్థులకు భారతీయ ప్రాంతీయ భాషలే కమ్యూనికేషన్ సాధనంగా పని చేస్తాయి. మాతృభాషలో బోధన చేస్తే కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఇదివరకే నిరూపించబడ్డాయి. పాఠాల్లోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడంలో స్థానిక భాషలు సహయకారిగా ఉంటాయి’అని ఏఐసీటీఈ పేర్కొంది.
‘భారతీయ భాషల్లో బోధించే కోర్సులు నిష్పాక్షికమైన విద్యను అందిస్తాయి. సాంస్కృతికంగా, విద్యాపరంగా యువతలో వికాసం పెరుగుతుంది. లేదంటే మానసికంగా వేదన పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాంతీయ భాషల్లో విద్యావ్యవస్థ న్యాయాన్ని ప్రొత్సహిస్తుంది. విద్యార్థులంతా సమానంగా ఉన్నామనే భావన కలిగిస్తుంది. తోటీ విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సమాచారం నిర్విరామంగా ప్రసారం అవుతుంది. అందుకోసం ఉపాధ్యాయులు స్థానిక భాషల్లో విద్యార్థులతో మాట్లాడాలి’ అని ఏఐసీటీఈ వివరించింది.
ఏఐసీటీఈ తాజా నిబంధనలపై పలు యూనివర్శీటీలు హర్షం వ్యక్తం చేశాయి. బెలగావీలోని విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్శిటీ(వీటీయూ) అధికారులు ఈ నిబంధనల అమలు కోసం తమ పరిధిలోని కాలేజీలకు తెలియజేస్తామన్నారు.
వీటీయూ వైస్ ఛాన్సలర్ ఎస్ విద్యాశంకర్ మాట్లాడుతూ.. కన్నడ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ఇది చాలా సాయంగా ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే సందేహాలను( డౌట్స్) నివృత్తి చేసుకోవడమే. మాతృభాషలో కాన్సెప్ట్ లను వివరించడం వల్ల మీరు కోల్పోయేది ఏమి ఉండదన్నారు. ఈ సంవత్సరం నుంచి ద్విభాష ప్రశ్నపత్రాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అయితే ప్రాంతీయ భాషల్లో విద్యార్థులను పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం వారి సందేహాలు నివృత్తి కోసం చేస్తున్న ఏర్పాటని అన్నారు.
Read More
Next Story