
తారామతి డ్రగ్స్ పార్టీ: డీజే జాసన్‌కు డ్రగ్ పాజిటివ్
పార్టీలో గ్రూపులుగా హాజరు, భారీ ఎంట్రీ ఫీజులు. కాంటాక్ట్స్‌పై నిఘా, సరఫరాదారుల కోసం గాలింపు కొనసాగింపు.
తారామతి బారాదరిలో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు కొత్త మలుపులు తిరిగింది. డీజే జాసన్ డైలాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. మొత్తం 6 గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒక మహిళ, బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్, ఇతర జూనియర్ ఆర్టిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఇటీవల తారామతి బారాదరిలో జరిగిన పార్టీ సందర్భంగా బయటపడింది. పార్టీకి వచ్చిన వారిని పోలీసులు గుర్తించి, కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పార్టీలో పాల్గొన్న వారు నలుగురి నుంచి పది మందితో కూడిన గ్రూపులుగా హాజరైనట్లు గుర్తించారు. ఒక్కో గ్రూప్ నుంచి రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ సరఫరా చేసిన వారి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. జాసన్ కాంటాక్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తూ ఈగల్, నార్కోటిక్స్ బృందాలు నిఘా కొనసాగిస్తున్నాయి. ఈవెంట్ నిర్వాహకుడిగా ఉన్న జాసన్‌కు గతంలో కూడా డ్రగ్స్ కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2023లో మిస్టర్ గ్లోబల్‌గా నిలిచిన ఆయనకు ఆంఫిటమైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పార్టీ ఏర్పాట్లలో జాక్, జాసన్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అభినేత సర్వర్, అలాగే ట్రేడింగ్ వ్యాపారంలో ఉన్న నిహార్, ఆషి దంపతుల కాంటాక్ట్స్‌పైనా విచారణ కొనసాగుతోంది.
పార్టీ పోస్టర్లలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సందేశాలు ఉన్నప్పటికీ, వాస్తవానికి అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డ జాసన్ డ్రగ్స్ సేవించిన స్థితిలో పట్టుబడ్డట్లు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

