టీడీపీ బీసీ డిక్లరేషన్‌ విడుదల

పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్‌ను జయహో బీసీ సభలో టీడీపీ నేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. బీసీల మేలుకోసం ఈ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నట్లు బీసీ నేతలు పేర్కొన్నారు.


టీడీపీ బీసీ డిక్లరేషన్‌ విడుదల
x
Nara Chandrababu naidu, tdp president

తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించింది. మంగళవారం రాత్రి నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉండే ప్రాంగణంలో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ప్రకటన చేశారు.

బీసీ డిక్లరేషన్‌లో పది సూత్రాలు ఉన్నాయి. ఈ పది సూత్రాలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది.
50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు.
బీసీ సబ్‌ప్లాన్‌ కింద ఐదు సంవత్సరాల్లో రూ. 1.50లక్షల కోట్లు ఖర్చు. ప్రతి సంవత్సరం రూ. 30వేల కోట్లు కేటాయింపు.
చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలుకు చట్టపరమైన చర్యలు. వైఎస్సార్‌సీపీ బీసీలకు తగ్గించిన రిజర్వేషన్‌ తిరిగి అమలు.
బీసీల్లోని 153 కులాలకు రాజకీయాల్లో అవకాశాలు, చట్ట సభలు, స్థానిక సంస్థల్లో అవకాశం లేని వారికి నామినేటెడ్‌ పదవులు.
ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా చట్ట సవరణ. జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా అవకాశాలు.
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రాజ్యాంగ రక్షణ చట్టం ఉందో అదే విధంగా బీసీలకు కూడా రక్షణ చట్టం.
బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేత.
ఐదువేల కోట్లతో ఆదరణ పథకాలు పంపిణీ.
షరతులు లేని విధంగా విదేశీ విద్యావకాశాలు కల్పిన. బీఈడీ చదువుకునే వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌.
చంద్రన్న బీమా కింద పేదలకు రూ. 10 లక్షలు అందజేత.
బీసీలందరికీ చంద్రన్న పెళ్లికానుక లక్ష రూపాయలు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేత.
బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ ఏడాది కాలంలో పూర్తి చేయడం.
రజకులను బీసీ జాబితా నుంచి తప్పించి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చర్యలు.
Next Story