భూస్వామి ముక్కుకోసి జేబులో పెట్టుకున్న మల్లేశం స్వీయ చరిత్ర వస్తాంది
x

భూస్వామి ముక్కుకోసి జేబులో పెట్టుకున్న మల్లేశం స్వీయ చరిత్ర వస్తాంది

మేరమల్లేశం స్వీయచరిత్ర, పోరాట పాటలు పుస్తకాన్ని 1000 పుస్తకాలు ముద్రించెందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ చివర్లో హైద్రాబాద్ లో ఆవిష్కరించడం జరుగుతుంది.


ఎవరీ మేర మల్లేశం?

తెలంగాణా భూమి భుక్తి విముక్తి పోరాటంలో పాల్గొని, తన పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచి అనేక ఉద్యమాలను నిర్మించారు మేర మల్లేశం. మల్లేశంగారి ఇంటి పేరు గూడూరి, పీడిత దర్జీ కులంలో పుట్టినందున మేర మల్లేశంగా ఖ్యాతికెక్కారు. వరంగల్ జిల్లా ఎర్రగొల్లపహాడ్ లో గూడూరు వెంకటయ్య, నాగమ్మలకు జన్మించారు. భార్య అరుణా దేవి కూడా కమ్యూనిస్ట్ నాయకురాలే. మల్లేశం గారి తాత నర్సయ్య కుటుంబంతో సహా అక్కన్నపేటకు వలస వచ్చారు. అక్కన్నపేటలో 1946-51ల మధ్య సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అనేకమార్లు జైలు కెళ్లారు. 1947లో వెల్దండిలో మల్లేశంను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. దప్పిక అంటే మూత్రం పోయడం నుంచి వేళ్లలో సూదులు గుచ్చడం, విపరీతంగా కొట్టడం జరిగింది. మద్దూరు, సలాకపురం, చేర్యాల, ఇటికాలపల్లి, ముస్త్యాల, బచ్చన్నపేట, కేశిరెడ్డిపల్లి, ఎంకిర్యాల, గానుగపహాడ్‌ గ్రామాలన్నీ తిప్పుకుంటూ కొట్టారు. జనగామ నిజాం సాహెబ్‌ అదాలత్‌ తీర్పు మేరకు 3 సంవత్సరాల 1 నెల జైలు శిక్ష పడింది. ఔరంగాబాద్‌, బాల్దా (హైదరాబాద్‌ చంచల్‌గూడ), జాల్నా కాన్సంట్రేషన్‌ క్యాంపు, బీడ్‌ జైళ్లలో ఆయన్ను నిర్బంధించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నప్పుడు వడ్లకొండ గ్రామానికి చెందిన ఓ భూస్వామి ముక్కు కోసి ఆ ముక్కును జేబులో పెట్టుకున్నాడు. అతను తాటి కొండకు వెళ్ళాడు, ఆ తర్వాత లడ్డునూర్, అక్కడ అతను సెప్టెంబర్ 1947లో అరెస్టు చేయబడ్డాడు మరియు వలస అధికారులచే తీవ్రంగా హింసించబడ్డాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు అంటే 1947 నుండి 1951 వరకు వివిధ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. అతన్ని ఝల్నా, ఔరంగాబాద్ మరియు హైదరాబాద్ జైళ్లలో ఉంచారు. జైల్లో ఉన్నా నిజాం రాజు పాలనకు, తెలంగాణలో నెలకొన్న భూస్వాముల దాస్యానికి వ్యతిరేకంగా విప్లవ గీతాలు ఆలపించారు. 1951లో విడుదల చేసి నజర్‌ బంద్‌ చేశారు. ఇదే క్రమంలో మల్లేశం తాత నర్సయ్యకు అక్కన్నపేట భూస్వామి చొక్కారావు గౌడి దున్నపోతు పొడవగా చనిపోయాడు. దీంతో మల్లేశం తండ్రి వెంకయ్య చొక్కారావుతో తగాదాపడి తనను కూడా చంపిస్తారనే భయంతో షోలాపూర్‌, పూనా వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి వచ్చారు.

మల్లేశం హైదరాబాద్‌కు బతుకుతెరువు కోసం వెళ్లగా అక్కడే ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభలతో పరిచయం ఏర్పడింది. అక్కడ ఒక సర్కస్‌ కంపెనీలో పనిచేశారు. అప్పటికే బుర్రకథలు చెప్పడం, వాక్చాతుర్యంతో పాటలు పాడడంలో ప్రవేశం ఉన్నందున ఆంధ్రమహాసభ కార్యకర్తలైన పండిత నరేందర్‌, జగన్‌, రామ్మూర్తిలతో కలిసి పనిచేశారు. ఆంధ్ర మహాసభ ఉనంచి తిరిగి వచ్చారు. తెలంగాణా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత కరీంనగర్‌ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పని చేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విడిపోయాక జిల్లాలో అమృత్‌లాల్‌ శుక్లా, మేర మల్లేశం, జాప లక్ష్మారెడ్డిలు సిపిఐ నుంచి వేరయ్యారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆహ్వానించారు. 1980 తర్వాత 1990 వరకు నక్సలైట్‌ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.

కొంతకాలం వారితో కలిసి పని చేశారు. 1997 ఆగష్టు 19న ఆయన మరణించారు. ఆయన సతీమణి అరుణా దేవి కూడా మరణించారు. మేర మల్లేశం రాసిన పాటలను " మేర మల్లేశం పోరాట పాటలు" రూపంలో 1997 జులైలో పుస్తకాన్ని తీసుకు వచ్చారు.


Read More
Next Story