
కొడుకు వివాహ ఆహ్వాన పత్రిక చూపిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు
కొడుకు వివాహ ఆహ్వానపత్రికకు శ్రీవారి చెంత పూజలు
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం దంపతులు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం వేకువజామున దర్శించుకున్నారు. తన కొడుకు సూర్య విక్రమాదిత్య వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేయించారు. మొదటి ఆహ్వాన పత్రికను శ్రీవారికి సమర్పించినట్లు బట్టి విక్రమార్క చెప్పారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం ఏడాది మార్చి నెలలో జరగుతుందని ఆయన తెలిపారు.
"మా ఇంటిలో జరిగే మొదటి శుభకార్యం ఇది. కాబోయే దంపతులకు శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చాం" అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు.
శ్రీవారి దర్శనం కోసం గురువారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య, కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున వీఐపీ విరామ సమయంలో బట్టి బట్టి విక్రమార్క శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ మొదటి ఆహ్వాన పత్రికను శ్రీవారికి అందించినట్లు బట్టి విక్రమార్క చెప్పారు.
"నా కుమారుడు సూర్య విక్రమాదిత్య, కాబోయే కోడలికి శుభాశీస్సులు అందించాలని ప్రార్థించడానికి వచ్చాం" అని బట్టి విక్రమార్క ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి దిశగా పయనించాలని శ్రీవారిని ప్రార్థించాలని ఆయన చెప్పారు.
Next Story

