వినియోగదారులపై ‘ట్రూఅప్’ భారం
2022-23లో డిస్కమ్ లు రు. 2448 కోట్ల ఖర్చు చేయాల్సుండగా రు. 7635 కోట్లు ఖర్చయ్యింది.
ఈనెల నుండి రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల కరెంట్ బిల్లుల భారం పెరగబోతున్నాయి. ఈనెలలో చెల్లించబోయే కరెంట్ బిల్లులు మోత మోగబోతున్నాయి. ఎందుకంటే, 2022-23లో ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ అనుమతించిన విద్యుత్ కొనుగళ్ళ ఖర్చులకు మించి అయినాయి. అందువల్ల అప్పటి అదనపు ఖర్చును ఇపుడు వినియోగదారుల నుండి వసూలు చేయాలని డిస్కమ్ లు డిసైడ్ అయ్యాయి.
అదనపు ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేయటాన్నే డిస్కమ్ లు ‘ట్రూఅప్’ ఛార్జెస్ అని డిస్కమ్ లు చెబుతున్నాయి. 2022-23లో డిస్కమ్ లు రు. 2448 కోట్ల ఖర్చు చేయాల్సుండగా రు. 7635 కోట్లు ఖర్చయ్యింది. ఆ తేడాను వినియోగదారుల నుండి వసూలుచేసుకునేందుకు కమిషన్ ఆమోదించింది. నవంబర్ నుండి యూనిట్ కు 30 పైసలు, డిసెంబర్ నుండి 50 పైసలు చొప్పున డిస్కమ్ లు వసూలు చేయబోతున్నాయి.
దక్షిణ డిస్కమ్ లో 29 నెలలు, ఉత్తర డిస్కమ్ లో 26 నెలల పాటు వినియోగదారులు ట్రూఅప్ ఛార్జీలను భరించక తప్పటంలేదు. ఎల్ నినో కారణంగా నిత్యావసరాల ధరలన్నీ పెరిగిపోవటంతో ప్రభావం ఎక్కువగా మధ్య తరగతి జీవుల మీదే పడింది. ఈ నేపధ్యంలో ఇపుడు కరెంట్ చార్జీలు కూడా పెరగటం అంటే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లుగానే భావించాలి.
