హరీశ్ అడిగాడు.. రేవంత్ ఇచ్చాడు  టింగ్ టింగ్ మంటూ రైతుబంధు నిధులు
x
ఊహాచిత్రం

హరీశ్ అడిగాడు.. రేవంత్ ఇచ్చాడు టింగ్ టింగ్ మంటూ రైతుబంధు నిధులు

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 11 అంటే సోమవారం సాయంత్రం నుంచే రైతుబంధు నిధుల్ని జమ చేస్తున్నట్టు ప్రకటించింది.


తెలంగాణ రైతులకు కాంగ్రెస్ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 11 అంటే సోమవారం సాయంత్రం నుంచే రైతుబంధు నిధుల్ని జమ చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ పై సమీక్ష తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

ప్రతిపక్షం అడిగిన 72 గంటల్లోనే..

అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావ్ రైతుబంధు నిధులేవీ అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం దీటుగానే స్పందించినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత ఉత్తర్వులు చూస్తుంటే. వాస్తవానికి ఎన్నికలకు ఒక రోజు ముందు రైతుబంధు నిధులు పడాల్సి ఉంది. అయితే ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండడంతో ఆ పని జరగలేదు. కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు వల్లే నిధులు ఆగాయని ఆవేళ హరీశ్ రావు, కేటీఆర్, కవిత లాంటి నేతలు ఆరోపించారు. హరీశ్ రావు చేసిన మాటల్ని బట్టే తాము ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ వాళ్లు తిప్పికొట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ నిధుల్ని రైతుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న తొలి నిధులు ఇవే.

2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ...

కాంగ్రెస్ ప్రకటించిన మరో పథకం 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఈ హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలో కార్యచరణకు రూపం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

Read More
Next Story