
తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ ఖరారు
హయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు కీలక అప్‌డేట్
తెలంగాణలో హయర్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు తేదీలను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాలెండర్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండల సెక్రరీ ప్రొఫసర్ శ్రీరామ్ వెంకటేష్ ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చే ఏడాది మే నెలలో వరుసగా ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెలలో న్యాయవిద్య, ఇంజనీరింగ్, అగ్రికల్చార్, మేనేజ్‌మెంట్ వంటి ప్రధాన కోర్సుల ఎంట్రన్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఈఏపీసీఈటీ(EAPCET) కు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలను మే నెల 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను జేఎన్‌టీయూ నిర్వహిస్తుంది. ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలు మే 13, 14 తేదీల్లో జరుగుతాయి. బీఈడీ కోర్సు ప్రవేశానికి మే 12న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీజీ ఈడీసెట్ పరీక్ష జరుగుతుంది.

