అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఎన్నో స్థానం..
x

అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఎన్నో స్థానం..

ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వే ప్రకారం యూపీలో అత్యధిక సంఖ్యలో కళాశాలలుండగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి.


ఆల్‌ ఇండియా సర్వే ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) 2021-22 నివేదిక ప్రకారం..ఉత్తరప్రదేశ్‌ అత్యధిక సంఖ్యలో కళాశాలలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 8,375 కాలేజీలు ఉన్నాయి. అంతకుముందు ఏడాది 8,114 కాలేజీలు ఉండేవి. ప్రతి లక్ష జనాభాకు కనీసం 30 లేదా అంతకంటే ఎక్కువ కళాశాలలు ఉన్నాయని నివేదిక తేల్చింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి లక్ష జనాభాకు ఉన్న కళాశాలల వివరాలకు పరిశీలిస్తే.. కర్ణాటక (66), తెలంగాణ (52), ఆంధ్రప్రదేశ్‌ (49), హిమాచల్‌ ప్రదేశ్‌ (47), పుదుచ్చేరి (53) మరియు కేరళ (46) కాలేజీలు ఉన్నాయి.

తొమ్మిదో స్థానంలో తెలంగాణ..

4,692 కాలేజీలతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా.. 4,430 కాలేజీలతో కర్ణాటక మూడో స్థానంలో, 3,934 కాలేజీలతో రాజస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది. 2,829 కాలేజీలతో తమిళనాడు ఐదో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్‌ (2,702), ఆంధ్రప్రదేశ్‌ (2,602), గుజరాత్‌ (2,395) వరుసగా ఆరు, ఏడో, ఎనిమిదో స్థానాల్లో ఉండగా తెలంగాణ (2,083) తొమ్మిదో స్థానంలో పశ్చిమ బెంగాల్‌ (1,514 కళాశాలలు) పదో స్థానంలో నిలిచింది.

కళాశాలల-రకాలు

ఏఐఎస్‌హెచ్‌ఈ కింద 328 విశ్వవిద్యాలయాలకు చెందిన 45,473 కళాశాలలు నమోదయ్యాయి. వీటిల్లో 14,197 పీజీ ప్రోగ్రామ్‌లు, 1,063 పీహెచ్‌డీ అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

60 శాతం కంటే ఎక్కువ కాలేజీలు సాధారణ స్వభావం ఉన్నవి కాగా, ఉపాధ్యాయ విద్యను అందిస్తున్నవి 8.7 శాతం కాగా 6.1 శాతం ఇంజనీరింగ్‌ కాలేజీలు, 4.3 శాతం నర్సింగ్‌ కాలేజీలు, 3.5 శాతం మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని సర్వేలో తేలింది. .

వివిధ రాష్ట్రాల్లో జిల్లాలవారీగా అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాలను పరిశీలిస్తే.. బెంగళూరు (1,106), జైపూర్‌ (703), హైదరాబాద్‌ (491), పుణె (475), ప్రయాగ్‌రాజ్‌ (398), రంగారెడ్డి (349), భోపాల్‌ (344), ఘాజీపూర్‌ (333), సికర్‌ (330), నాగ్‌పూర్‌లో 326 కాలేజీలు ఉన్నాయి.

Read More
Next Story