మావోయిస్ట్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ !
x

మావోయిస్ట్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణ !

17 మంది మాత్రమే ఉన్నారన్న డీజీపీ.


మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారడానికి తెలంగాణ అతి చేరువలో ఉందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో తెలంగాణకు చెందిన వారు 17 మంది మాత్రమే ఉన్నారని, వారు లొంగిపోతే తెలంగాణ కూడా మావోయిస్ట్ రహిత రాష్ట్రం అవుతుందని వెల్లడించారు. వారిలో కేంద్రకమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఇద్దరు ఉన్నారని ఆయన వివరించారు. ఈ 17 మందిలో మహిళలు ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. వారందరిపై కలిపి మొత్తం రూ2.25 కోట్ల రివార్డ్ ఉందని పేర్కొన్నారు. వారంతా లొంగిపోవాలని కూడా ఆయన సూచించారు. ఆపరేషన్ కగార్ గడువులోపే తెలంగాణ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

దేవ లొంగిబాటు

ఇటీవల మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు బర్సేదేవా లొంగిపోయారు. గెరిల్లా స్టైల్ పోరులో దేవా దిట్ట ఆయనతోపాటు మరో 48 మంది మావోయిస్ట్‌లు కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఆయుధాలు వీడారు. వీరిలో దేవాతో పాటు తెలంగాణ ఏరియాలో కీలక నేత కంకణాల రాజిరెడ్డి కూడా ఉన్నారు.

Read More
Next Story