మేడారం భక్తుల కోసం పాము కాటు చికిత్స మందులు కూడా రెడీ
x

మేడారం భక్తుల కోసం పాము కాటు చికిత్స మందులు కూడా రెడీ

జనవరి 28 నుండి 31 వరకు జరిగే మేడారం జాతరలో 3 వేలమంది వైద్య సిబ్బింది సేవలు


భారతదేశంలో అతిపెద్ద గిరిజన మేళా సమ్మక్క–సారలమ్మ జాతర కోసం 3,199 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఇది అటవీ ప్రాంతం కాబట్టి పాముకాట్ల ప్రమాదం ఉన్నందున యాంటివేనం ను సిద్ధంగా ఉంచారు. వైద్యులు, దారిపొడగునా వైద్య శిబిరాలు, అంబులెన్స్ లతో పాటు పిల్లలకు పెద్దలకు అవసరయ్యే మందులతోపాటు పాముకాటు మందులను కూడా సిద్దంగా ఉంచారు. ఈ విషయాలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహా వెల్లడించారు.

లక్షలాది ప్రజలు హాజరవుతున్నందు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తక్షణం పరీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లుచేస్తున్నది. ఈ ఏర్పాట్లను తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు. మేడారంలోని 50 పడకల ప్రధాన ఆసుపత్రితో అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి సహా మూడు ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదనంగా, జాతర ప్రాంతం, చుట్టుపక్కల 30 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మేడారంకు దారితీసే ఎనిమిది ప్రధాన మార్గాల్లో 42 మార్గమధ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

‘గోల్డెన్-అవర్’ అత్యవసర చికిత్స కోసం మొత్తం 35 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఇక పిల్లలకు అవసరయ్యేలతో పాటు, పాము విష నిరోధక మందులు సహా 248 రకాల మందులను నిల్వ ఉంచామని రాజనర్సింహ తెలిపారు.

వరంగల్‌లోని ఎంజీఎం, ములుగు జిల్లా ఆసుపత్రులు 24 గంటలూ సేవలకు అందుబాటులో ఉంటాయని, ఎటువంటి లోపాలు లేకుండా చూసేందుకు క్షేత్రస్థాయి పర్యవేక్షణ నిరంతరం జరుగుతుందని ఆరోగ్య మంత్రి తెలిపారు.




సమ్మక్క–సారలమ్మ జాతర

జనవరి 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర జరుగుతున్నది. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన పండుగ, ఇక్కడకు దక్షిణ భారతదేశం నుంచే కాకుండా మధ్య భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి గిరిజన భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దేవతలకు మొక్కు చెల్లించుకుంటారు.

కాకతీయ పాలకులకు విధించిన పన్నులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారులు సమ్మక్క ,సారలమ్మ (తల్లి మరియు కుమార్తె). అందుకే వారిని దేవతలుగా కీర్తిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ పన్నులు చెల్లించడానికి గిరిజనులు నిరాకరించారని, దానితో కోయ తెగలకు, కాకతీయ పాలకులకు మధ్య యుద్ధం జరిగిందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.

యుద్ధంలో సమ్మక్క భర్త. గిరిజన రాజు పగిడిద్దరాజుమరణించారు, ఆ తరువాత సమ్మక్క ఆమె కుమార్తె సారలమ్మ కాకతీయ పాలకులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని ఈ జానపద గాథ.

Read More
Next Story