తెలంగాణ సూర్య దేవాలయం గ్రహణం వీడేది ఎపుడు?
x
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ప్రాచీన సూర్య దేవాలయం

తెలంగాణ సూర్య దేవాలయం గ్రహణం వీడేది ఎపుడు?

ఆర్కియాలజీ శాఖ సర్వేకే పరిమితం. రక్షిత పురాతన కట్టడం హోదాకు ఎదురుచూపు. పునరుద్ధణ ఎప్పుడు?


నల్గొండ జిల్లా లోని ఆకారంలో ఉన్న ప్రాచీన సూర్య దేవాలయం ను రక్షిత పురాతన కట్టడంగా అన్ని అర్హతలు ఉన్నాయి అని ఆర్కియాలజీ సర్వే అఫ్ ఇండియా నిర్దారించినా దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. గత గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఆకారం సూర్య దేవాలయం గురించి ట్విట్టర్ (x) లో పోస్ట్ చేసిన తరువాత ఈ దేవాలయం వెలుగులోకి వచ్చింది.

ఆకారం సూర్యదేవాలయం ప్రత్యేకత ఏమిటి ?

ఒడిశా లోని కోణార్క్ సూర్య దేవాలయం, ఆంధ్ర ప్రదేశ్ లోని అరసవెల్లి సూర్య దేవాలయం లోని విశిష్టత ఆకారం సూర్య దేవాలయంలో ఉందని అక్కడి ప్రజలు చెబుతారు. త్రికూట ఆలయంగా ఆకారం సూర్య దేవాలయం ప్రత్యేకతను కలిగి ఉంది.

ఆకారం సూర్య దేవాలయం లో లభించిన ప్రాచీన విగ్రహాలు

ఈ దేవాలయం రాష్ట్ర రాజధాని నుంచి 110 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

దేవాలయంలో లభించిన శిలా శాశనం ప్రకారం ఈ సూర్య దేవాలయం చాళుక్య రాజుల కాలంలో 11వ శతాబ్దం లో నిర్మించారు. అరుదైన వీర వ్రతహారం విగ్రహంను సైతం పురావస్తు శాఖ అధికారులు ఈ దేవాలయం ప్రాంగణంలో కనుగొన్నారు. వీర వ్రతహారం అంటే భక్తుడు దేవునికోసం ఆత్మత్యాగం చేసే ప్రత్యేక పక్రియ.

ఆకారం సూర్యదేవాలయం దుస్థితికి కారణం

గత కొన్ని దశాబ్దాలకు ఆకారం సుర్య దేవాలయంలో దూప దీప నైవేద్యాలు మానివేయటంతో భక్తులుకూడా వెళ్ళటం మానివేశారు. దేవాలయం చుట్టూ చెట్ల పొదలు పెరిగాయి. దీనిని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధులకోసం దేవాలయంలో తవ్వకాలు జరిపారు. దేవాలయంలోని అరుదైన సూర్య భగవానుని రాతి విగ్రహం కూడా చోరీకి గురు అయ్యింది.

2020 సంవత్సరంలో ఒక ఆంగ్ల పత్రికలో ఈ దేవాలయం గురించి వార్త రావడంతో అప్పటి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ దాని పరరక్షణకు అవశ్యం తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీనితో ఈ దేవాలయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆమె జోక్యంతో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆకారం సూర్య దేవాలయంను సందర్శించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించారు.


దీని ఆధారంగా కేంద్ర పురావస్తు శాఖ ఆకారం సూర్య దేవాలయం పునరుద్ధరణ, రక్షణ కోసం కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు తయారుచేయడానికి శాఖ అధికారి ఎం నవీన్ కుమార్ ను నియమించింది. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల సూర్య దేవాలయ పునరుద్ధరణ అంశం పక్కన పడింది.

గ్రామానికి చెందిన వృద్ధుడు ఎం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో ఏడు గుర్రాల రథంపై సూర్యభగవానుడు కూర్చుని ఉన్న విగ్రహమును దేవాలయంలో చూసానుఅని తెలిపారు. అది అపహరణకు గురి అయ్యి ఉండవచ్చు అని అయన తెలిపారు. ప్రస్తుతం ఆ సూర్య భగవానుడి విగ్రహం దేవాలయంలో కనిపించటం లేదు. కొన్ని దశాబ్దాలుగా గుడిలో పూజలు కూడా మానివేయడం వల్ల భక్తులు వెళ్ళాక ఈకాలంలొ సూర్య భగవానుని విగ్రహం ఎప్పుడు చోరీకి గురిఅయిందో స్పష్టంగా తెలియదన్నారు.

గ్రామంలోని యువకులతో కలిసి దేవాలయం పరిసరాలను శుభ్రం చేశామని ఆకారం సూర్య దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు కందాల సమరం తెలిపారు. అలాగే సూర్య దేవాలయం లో పూజ నిర్వహణకు చర్యలు చేపట్టంటంతో శుభ దినాలు, పండుగల సందర్భంలో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సూర్యదేవాలయంను సందర్శింటం ప్రారంభించారన్నారు. ప్రాచీన సూర్య దేవాలయం పునరుద్ధరణ, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

Read More
Next Story