మతసామరస్యంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి
x
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎంకు మెమొంటో అందజేస్తున్న నేతలు

మతసామరస్యంతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం: సీఎం రేవంత్ రెడ్డి

మైనారిటీలకు సింహభాగం అవకాశాలు… ముస్లీంలకు సీఎం ఇఫ్తార్ విందు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రసంగించారు. ‘‘రమజాన్ కేవలం పండుగ కాదు ..ఆత్మ శుద్ధి చేసుకునే సమయం..రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు సంతోషం గా ఉంది,సోదరభావం తీసుకువచ్చి మతసామరస్యం తో కలిసి మెలిసి ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చామని, సీనియర్ నేత షబ్బీర్ అలీ కి సలహాదారు పదవి ఇచ్చామని సీఎం తెలిపారు.8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని సీఎం వెల్లడించారు.‘‘క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం..బాక్సర్ నిక్కత్ జరీన్ కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాం.ప్రభుత్వ ప్రతి కార్యక్రమం లో మైనార్టీల కు సింహ భాగం ఇస్తున్నాం..అంతా కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం కోరారు.

‘‘వైఎస్ హయాం లో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు..రిజర్వేషన్ల వల్ల అనేక మంది కి ఉద్యోగాలు వచ్చాయి..ఈ ప్రభుత్వం మీది ,నేను మీ సోదరుడి ని, మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి ..మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు..మనం కలిసి మెలసి తెలంగాణ ను ముందుకు తీసుకెళ్లాలి ...దేశం లో తెలంగాణ ను అభివృద్ధి లో ముందుకు తీసుకు వెళ్దాం’’ అని సీఎం చెప్పారు.వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో ముస్లిం మైనారిటీలకు గణనీయమైన నిధుల కేటాయింపును కూడా సీఎం ఎత్తి చూపారు.
Read More
Next Story