అమెరికా స్వర్గ మార్గంలో గంటకి పది మంది భారతీయుల అరెస్టు...
వేల సంఖ్యలో భారతీయులు, ముఖంగా గుజరాతీయులు, అమెరికాలోకి దొంగగా దూరుతూ దొరికిపోతున్నారు.
ప్రతి గంటకి పది మంది భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేస్తున్నారు. అంటే రోజుకి 240 మందిని. నెలకి 7200 మంది. వీళ్లందరిని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) అరెస్టు చేసి అక్కడి పోలీసులకు అప్పగిస్తున్నారు. వీళ్లంతా అమెరికాలో దొంగగా చొరబడుతూ సిబిపి అధికారులకు దొరికిపోతున్నారు. వీళ్లందరిని మర్యాదాగానే విమానాల్లో ఎక్కించి ఇండియాకు తరిమేస్తున్నారు. అక్టోబర్ 22న ఒక పెద్ద విమానం నిండా ఇలాంటి వాళ్లని ఇండియాకు తరిమేశారు. 2023లో అమెరికాలో దొంగగా చొరబడుతున్న 96,917 మంది భారతీయులను ఆదేశ అధికారులు పట్టుకున్నారు.
భారతదేశం విశ్వగురు అని, ఎంతగానో అభివృద్ధి చెందుతున్నదని మోదీ ప్రభుత్వం చెబుతున్నా అమెరికాలోనే బతుకు బాగుపడుతుందని వీళ్లంతా నమ్ముతున్నారు. అందుకే ఏదో విధంగా ఆదేశంలోకి దూరాలని ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతీయులంతా కెనడా నుంచి అమెరికాలోకి సులభంగా దూరవచ్చని అనుకుంటుంటారు. గత ఏడాది ఇల్లీగల్ గా ఆమెరికాలోకి దూరుతూ అధికారులకు చిక్కిన భారతీయుల్లో సగం మంది గుజరాత్ వాళ్లని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ డేటా చెబుతుంది.
అక్టోబర్ 1,2023 నుంచి సెప్టెంబర్ 30,2024 దాకా మొత్తంగా అనేక ప్రపంచ దేశాలనుంచి 29 లక్షల మంది అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నించారు. వాళ్లందరిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య 90,145. మెక్సికో డాంకీ రూట్ నుంచి ఎక్కువ సంఖ్యంలో భారతీయులు అమెరికాలోకి దూరే వారు, ఈ మధ్య ఈరూట్ ని మానేస్తున్నారు. దీనికి కారణం.ఆ రూట్ లో అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టడమే. మెక్సికో డాంకీ రూట్ q ద్వారా వెళ్లేవాళ్లని బ్రోకర్లు దుబాయ్, టర్కీలలో దాచేవారు. ఈ మధ్య భారతీయుల డాంకీ రూట్ మీద నిఘా పెంచి బ్రోకర్ నెట్ వర్క్ ని విచ్ఛిన్నం చేయడంతో మెక్సికో రూట్ దాదాపు మూత పడింది.
దానితో అంతా కెనడా రూట్ లోకి వస్తున్నారు. గుజరాతీలు కూడా కెనడా మార్గంలోకి మళ్లారు. కెనడా నుంచి ఒక టాక్సి అద్దెకు తీసుకుని అమెరికాలోకి చొరబడవచ్చిన భారతీయులు కనిపెట్టారు. కెనడా విజిటర్ వీసాలతో అమెరికా స్వర్గ సీమలో దూరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా నిఘా పెరగడంతో అమెరికా-కెనడా బార్డర్ దగ్గిర భారతీయులను అదుపులోకి తీసుకోవడం పెరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 43764 మందిని కెనడా బార్డర్ దగ్గిర పట్టుకున్నారు. ఒక బార్డర్ దగ్గిర ఇంత భారీగా ఇల్లీగల్ ఇండియన్లు అధికారులకు దొరకడం ఒక రికార్డు. 2024లో మెక్సికో బార్డర్ దగ్గిర దొరికిన వాళ్లు 25616 మంది మాత్రమే. 2023లో మెక్సికో బార్డర్ దగ్గిర దొరికిన వాళ్లు 41770 మంది. వీళ్లందరిని చాలా మర్యాదగా చార్టెర్డ్ విమానాలలో అమెరికా ఇంటికి పింపిస్తూ ఉంది.