టెస్ట్ క్రికెట్ మజా ‘రాజ్ కోట’లో తెలుస్తుంది: ఆసీస్ లెజెండ్
x

టెస్ట్ క్రికెట్ మజా ‘రాజ్ కోట’లో తెలుస్తుంది: ఆసీస్ లెజెండ్

రాజ్ కోట్ వేదికగా గురువారం భారత్ - ఇంగ్లండ్ మూడో టెస్ట్ లో తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్ 1-1 తో సమంగా ఉంది. ఈ సిరీస్ పై ఆసీస్ లెజెండ్ ఏమన్నారంటే..


భారత్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఇక నుంచి హోరాహోరీగా సాగుతుందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాఫెల్ అభిప్రాయపడ్డారు. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయని, ఇరు జట్లు కూడా బలంగా ఉండడంతో పోరు రసవత్తరంగా జరుగుతుందని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే కెప్టెన్లు ఇరు జట్లకు ఉండడం కూడా శుభపరిణామం అన్నారు.

భారత్, ఇంగ్లండ్ జట్లు రెండు కూడా హైదరాబాద్, విశాఖపట్నంలో ఉత్కంఠభరితమైన విజయాలు సాధించాయి. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ 1-1 తో సమమైంది. " హోమ్ సిరీస్ ను గెలివాలి అని భారత్ అనుకుంటోంది. కానీ ప్రత్యర్థి అంత తేలిగ్గా లొంగడని ఇప్పటికే రుజువైంది. ఇకముందు జరిగేది అసలు యుద్ధం" అని వివరించారు.

ఇంతకుముందు ఇంగ్లండ్ క్రికెట్ ను సాంప్రదాయ శైలిలో ఆడే జో రూట్ కెప్టెన్ నడిపించాడు. తన నాయకత్వంలో జట్టు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు సిరీస్ ను కొల్పోయింది. భారత్ పన్నిన స్పిన్ ఉచ్చులో పడి విలవిల లాడింది. ఇప్పుడు దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న బెన్ స్టోక్స్ కు జట్టు పగ్గాలందుకున్నాడు. ఫలితాలు కూడా బానే వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి సిరీస్ మొత్తానికి దూరం అవడం భారత జట్టుకు ఇబ్బందే అన్నారు. అయితే జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని అన్నారు. మిగిలిన ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహూల్ కూడా గాయాల బారిన పడడం కొంచెం ఆందోళన కలిగించే పరిణామమే అని, జట్టు కూర్పు సమయానికి అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాని ఓ మీడియా సంస్థకు రాసిన వ్యాసంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరో వైపు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మరో కీలక ఆటగాడు జట్టు నుంచి తప్పించడం ఆలోచించాల్సిన విషయం అన్నారు. శ్రేయస్ రెండు టెస్ట్ ల్లో 35,13,27,29 పరుగులు మాత్రమే సాధించి జట్టుకు బరువుగా మారాడని పేర్కొన్నారు. " సెలెక్టర్లు శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేయడం మానేసి, కుల్డీప్ యాదవ్ వికెట్ టేకింగ్ సామార్థ్యాన్ని మాత్రం విలువైనదిగా నేర్చుకున్నారు " అని అన్నారు. " ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఇరు జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్ హోరాహోరీగా సాగుతుందనడంలో ఎలాంటి సంశయం అక్కరలేదు" అని చాపెల్ తన అభిప్రాయాన్ని ఇలా రాసుకొచ్చారు.

Read More
Next Story