
సంప్రదాయాన్ని పాటించిన రేవంత్ రెడ్డి(వీడియో)
ఇద్దరు ఒకరికి మరొకరు నమస్కారం పెట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు సోమవారం అరుదైన దృశ్యం గోచరమైంది. అదేమిటంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీటు దగ్గరకు ముఖ్యమంత్రి, సభాపతి ఎనుముల రేవంత్ రెడ్డి వెళ్ళారు. రేవంత్ తనదగ్గరకు వస్తుండటాన్ని గమనించిన కేసీఆర్ లేచి నిలబడ్డారు. అప్పటికి (Revanth) రేవంత్ సీటు దగ్గరకు రాగానే (KCR)కేసీఆర్ నమస్కారం పెట్టారు. ఇద్దరు ఒకరికి మరొకరు నమస్కారం పెట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కేసీఆర్ యోగక్షేమాలను రేవంత్ అడిగారు. అసెంబ్లీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత సభలో జీవోఅవర్ ప్రారంభానికి ముందే కేసీఆర్ సభనుండి వెళ్ళిపోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్-కేసీఆర్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. సభల్లో, మీడియా సమావేశాల్లో ఇద్దరు ఒకిరిని మరొకరు ఎంతగా దుర్భాషలాడుతున్నారో చూస్తున్నదే. అయినా సరే అసెంబ్లీసమావేశాలకు హాజరైన ప్రతిపక్షనేతల దగ్గరకు వెళ్ళి ముఖ్యమంత్రి కలవటం, యోగక్షేమాలను తెలుసుకోవటం కనీసమర్యాద, సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని రేవంత్ ఈరోజు సభలో ప్రదర్శించారు. నిజానికి ప్రతిపక్ష నేతలను ముఖ్యమంత్రి పలకరించకపోయినా ఏమీకాదు. మహాయితే ఆ విషయం మీడియాలో వార్తవుతుందంతే.
ఈ విషయం తెలిసికూడా కేసీఆర్ దగ్గరకు వెళ్ళిన రేవంత్ కరచాలనం చేయటం, యోగక్షేమాలు తెలుసుకోవటం సంతోషించాల్సిన విషయమే. ఇలాంటి ఘటనలే రాజకీయాల్లో ప్రత్యర్ధుల మధ్య స్పర్ధలను తగ్గిస్తుంది అనటంలో సందేహంలేదు. ఆమధ్య కాలి తుంటిఎముక విరిగి ఆపరేషన్ చేయించుకుని కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నపుడు కూడా రేవంత్ వెళ్ళి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆసుప్రతిలో మంచంమీద పడుకుని ఉన్న కేసీఆర్ ను కలుసుకున్న రేవంత్ త్వరగా కోలుకోవాలని ఆశించారు. అలాగే కేసీఆర్ కు అత్యున్నత వైద్య సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది.

