రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర’ లక్ష్యం అదేనా?
x

రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర’ లక్ష్యం అదేనా?

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ గతంలో చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు, త్వరలో చేయబోయే పాదయాత్రకు మధ్య తేడా ఏంటి?


ఏఐసీసీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ‘భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర’ పేరిట జనవరి 14 నుంచి ఈ యాత్ర చేపడుతున్నారు. భారతదేశ తూర్పుదిశ నుంచి పశ్చిమానికి 66 రోజులపాటు చేపట్టే పాదయాత్రలో 15 రాష్ట్రాలు, 110 జిల్లాలను కవర్‌ ‌చేస్తూ 6,700 కి.మీలు సాగనుంది.

2022లో భారత్‌ ‌జోడో యాత్ర..

రాహుల్‌ ‌గాంధీ ‘భారత్‌ ‌జోడో యాత్ర’ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశం దక్షిణ ధృవం నుంచి ఉత్తరం వైపునకు యాత్ర చేపట్టారు. సెప్టెంబరు 7, 2022న యాత్ర కన్యాకుమారిలో మొదలైంది.

ఈసారి మణిపూర్‌ ‌నుంచి..

ఈసారి హింస, అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌ ‌నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇంఫాల్‌ ఈస్ట్ ‌హట్టకాంజేబుంగ్‌ ‌నుంచి నుంచి చేపట్టే పాదయాత్రకు తొలుత అనుమతి లభించలేదు. బుధవారం ‘‘పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో పాదయాత్ర చేపట్టేందుకు అనుమతి లభించింది.

భారత్‌ ‌జోడో యాత్ర తేదీలు:

సెప్టెంబర్‌ 7, 2022 ‌నుండి జనవరి 30, 2023 వరకు

భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర (తాత్కాలికంగా): జనవరి 14, 2024 నుండి మార్చి 20, 2024 వరకు

రోజుల సంఖ్య..

భారత్‌ ‌జోడో యాత్ర: 136

భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర (తాత్కాలిక): 66-68

మొత్తం దూరం..

భారత్‌ ‌జోడో యాత్ర: 4080 కి.మీ

భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర (ప్రణాళిక): 6713 కి.మీ.

భారత్‌ ‌జోడో యాత్ర పరిధిలోకి వచ్చే రాష్ట్రాల సంఖ్య: 12 (తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌జమ్మూ మరియు కాశ్మీర్‌)

‌భారత్‌ ‌జోడో న్యాయ యాత్ర (షెడ్యూల్డ్): 15 (‌మణిపూర్‌, ‌నాగాలాండ్‌, అస్సాం, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, ‌బీహార్‌, ‌జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌గుజరాత్‌, ‌మహారాష్ట్ర)





లక్ష్యం..

భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం ‘‘భారతదేశాన్ని ఏకం చేసి బలోపేతం చేయడం’’ కాగా.. భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లక్ష్యం ‘‘సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాటం.

అప్పట్లో ఎన్నికలు లేవు..

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్‌ ‌జోడో యాత్ర ప్రారంభించినప్పుడు, రాష్ట్ర ఎన్నికలు లేవు. ఆ కారణంగా బీజేపీతో సహా ప్రతిఒక్కరూ దానిని కొంత తేలికగా తీసుకున్నారు.

ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో..

భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోక్‌సభ ఎన్నికలకు ముందు చేపడుతున్నారు. ఏప్రిల్‌-‌మే మాసాల్లో నాలుగు రాష్ట్రాలు.. ఆంధప్రదేశ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కింలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి.

యాత్ర ప్రభావంతోనే..

భారత్‌ ‌జోడో యాత్ర ప్రభావం మూడు నెలల ర్యాలీ అనంతరం కనిపించింది. మే 2023లో జరిగిన కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌గెలుపునకు కారణమైంది. యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకున్న రాహుల్‌ ‌గాంధీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక పొరుగు రాష్ట్రంలోనూ రాహుల్‌ ‌పాదయాత్ర ప్రభావం ఉంది. ఈ రాష్ట్రంలో కూడా హస్తం పార్టీ గెలుపొందడంతో రాహుల్‌ ‌యాత్ర సత్ఫలితాలు ఇస్తుందని కాంగ్రెస్‌ ‌పెద్దలు భావించారు. అందుకే మరోసారి భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్రకు సిద్ధమవుతున్నారు.

కూటమి భాగస్వాములంతా పాల్గొనొచ్చు..

‘‘భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్రకు అందరూ ఆహ్వానితులే. భారత కూటమికి చెందిన పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పార్టీలు, ప్రజా సంఘాలు యాత్రలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం’’ అని కాంగ్రెస్‌ ‌కమ్యూనికేషన్స్ ‌చీఫ్‌ ‌జైరాం రమేష్‌ ‌పేర్కొన్నారు.

గతంలో కంటే తక్కువ ..

భారత్‌ జోడో యాత్ర సమయంలో కొంతమంది కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాదయాత్ర ముగిసే వరకు రాహుల్‌ వెంటే నడిచారు. రాత్రి పూట వారంతా కంటైనర్‌ వ్యాన్లలో నిద్రించారు.అయితే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కోసం రాహుల్‌తో నడిచే శాశ్వత బృందాలు ఉండకపోవడం వల్ల తక్కువ కంటైనర్‌ వ్యాన్లు ఉంటాయట.

తక్కువ రోజులు.. ఎక్కువ దూరం..

భారత్‌ జోడో యాత్రను 136 రోజులలో 4,080 కి.మీ.లను పూర్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ రాష్ట్రాలను కవర్‌ చేయాలన్న లక్ష్యంతో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను 68రోజుల్లో 6,713 కి.మీ దూరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజూ 8-9 కి.మీ నడిచి, తర్వాత బస్సులో దాదాపు 80 కి.మీ ప్రయాణించనున్నారు. రాహుల్‌ గాంధీ ప్రతిరోజూ రెండు చోట్ల ప్రసంగించేలా ఏర్పాటు చేస్తున్నారు.

బీజేపీ కోటపైనే ఫోకస్‌..

యాత్రిను గరిష్టంగా 11 రోజులు ఉత్తరప్రదేశ్‌లోనే షెడ్యూల్‌ చేశారు. ఈ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 1,074 కి.మీ. దూరం పాదయాత్ర సాగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటు వారణాసి, సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలీ, స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌ గాంధీ నియోజకవర్గం అమేథీ మీదుగా పాదయాత్ర సాగేలా ప్లాన్‌ చేశారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు..

అస్సాంలో 8 రోజులు జార్ఖండ్‌లో 7, బీజేపీ చేతిలో ఓడిపోయిన మధ్యప్రదేశ్‌లో 7, బీజేపీ కోట గుజరాత్‌, మహారాష్ట్ర, ఐదు రోజులు పాదయాత్ర సాగేలా ప్లాన్‌ చేశారు. బీహార్‌, ఒడిశాలో నాలుగు రోజులు, పశ్చిమ బెంగాల్‌లో 5 రోజులు, రాజస్థాన్‌లో ఒక రోజు పాదయాత్ర సాగనుంది.

Read More
Next Story