
మూడో దశ ‘సర్’ కు ఎన్నికల సంఘం ప్రణాళికలు
జనాభా లెక్కల నేపథ్యంలో ఈసీ ముందు తేదీల చిక్కులు
ఎన్నికల సంఘం దేశంలోని మిగిలిన ప్రాంతాలను కవర్ చేసే విధంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(ఎస్ఐఆర్ లేదా సర్) మూడో దశని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
2027 లో దేశంలో జనాభా లెక్కలు నిర్వహించనందున ఎస్ఐఆర్ మూడో దశ తేదీలను ప్రకటించేందుకు ఈసీ సెన్సాస్ కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్జీఐ) తో ఉన్నత స్థాయి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
‘సర్’ ఫేజ్ త్రీ కింద అందుబాటులో ఉన్న సమయం కేవలం ఫిబ్రవరి- ఏప్రిల్ మాత్రమే. ఈ సంవత్సరం జూన్- ఆగష్టు మాత్రమే ఉన్నాయి.
జనాభా లెక్కలు..
2027 లో జరగనున్న జనాభా లెక్కలు, దేశవ్యాప్తంగా రాబోయే పరీక్షల సీజన్ కారణంగా ఈసీ మూడో దశ ‘సర్’ కు సంబంధించిన తేదీలను నిర్ణయించడంలో సందిగ్థంలో ఉంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడానికి పోల్ బాడీ బూత్ లెవల్ ఆఫీసర్ పై ఎక్కువగా ఆధారపడింది. చాలా సందర్భాలలో బీఎల్ఓలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లో తమ సాధారణ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ఈసీ ‘ఎస్ఐఆర్’ చేయమని చెప్పలేదు. వీరికి ప్రత్యేకంగా ఉన్న సమయాన్ని మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా జరిగే ఈ జనాభా లెక్కింపు రెండు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశ ఇళ్ల జాబితా ఈ సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య ప్రణాళిక చేయబడింది.
ప్రతి రాష్ట్రంలో 30 రోజుల్లో ఈ కార్యకలాపాలూ పూర్తి అవుతాయి. రెండో దశ జనాభా గణన ఫిబ్రవరి 2027 లోపు జరగనుంది. పాఠశాల పరీక్షలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. దీనికి అర్థం ఏంటంటే.. ఎస్ఐఆర్ ప్రక్రియకు బీఎల్ఓలు గా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరు.
ఎస్ఐఆర్ ఫేజ్ 2 కింద ఫిర్యాదులు..
ఎస్ఐఆర్ లేదా సర్ రెండో దశ జరిగిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అనేక సమస్యలు ఎదుర్కొంది. ఇందులో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
2002 లో జరిగిన ఇంటెన్సివ్ ఎలక్టోరల్ రోల్ సవరణతో ప్రతి ఓటర్ ను అనుసంధానం చేయడంతో బీఎల్ఓలకు అధిక పనిభారం పడుతోంది. పని ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది బీఎల్ఓలు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
‘సర్’ పై రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అనేక రాష్ట్రాలు అక్రమంగా ఓటర్లు తొలగిస్తున్నాయని కోర్టులలో కేసులు దాఖలు చేస్తున్నాయి. గతవారం సుప్రీంకోర్టు ఓట్ల తొలగింపు ప్రశ్నలు లేవనెత్తింది.
ఓటర్లు అప్పిల్ చేసుకోవడానికి గడువు పొడిగించాలని ఈసీని ఆదేశించింది. జూన్ 2025 లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసీ సర్ ను ప్రారంభించడం రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించారు. జనాభా లెక్కలు, పరీక్షలతో తేదీలు ఘర్షణ పడటం వలన మూడో దశకు ఈసీ పని కష్టతరం అయ్యే అవకాశం ఉంది.
Next Story

