శాశ్వత పరిష్కారం చూపేదాకా ‘ఉచితాలు’ కొనసాగాల్సిందే..
x

శాశ్వత పరిష్కారం చూపేదాకా ‘ఉచితాలు’ కొనసాగాల్సిందే..

వివిధ పథకాల పేరుతో ప్రభుత్వాలు ప్రజలకు నగదు ఉచితంగా ఇస్తున్నాయి. అర్హులకు అలా ఇవ్వడాన్ని సమర్థిస్తున్నారు సీపీఐ(ఎం) సీనియర్‌ లీడర్‌ శైలజ.


ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేదాకా తాత్కాలిక సాయం కొనసాగాల్సిందేనని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు కెకె శైలజ అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పింఛన్లు, స్కాలర్‌షిప్‌ ప్రజలకు కొంతమేర ఉపయోగపడతాయన్నారు. తిరువనంతపురంలో జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్‌ (ఎంబీఐఎఫ్‌ఎల్‌)` 2024’లో ఆమె మాట్లాడారు.

ప్రజా సంక్షేమానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ‘‘శాస్త్రీయ దృక్పథాన్ని’’ అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.

‘‘ఉచితాలు’’ సరైనవేనా అని అడిగిన ప్రశ్నకు దేశం పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేదాకా వాటిని కొనసాగించాలని సమాధానమిచ్చారు.

సంక్షేమ పింఛను..

కేరళలో పరిస్థితిని వివరిస్తూ.. ప్రభుత్వం ప్రతినెలా అర్హులైన వారికి రూ.1,600 ఇవ్వాలని, నిత్యావసరాల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలన్నారు.

భూసేకరణ, తొలగింపు లేకుండా అభివృద్ధి జరగదన్నారు. కేరళ అభివృద్ధికి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పర్యాటక అభివృద్ధి చాలా అవసరమని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 8న ప్రారంభమైన ఎంబీఐఎఫ్‌ఎల్‌ సాహితీ కార్యక్రమం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా వక్తలు ఇందులో పాల్గొంటున్నారు

Read More
Next Story