ఢిల్లీ కెప్టెన్ ను ప్రకటించిన యాజమాన్యం.. ఆ డాషింగ్ బ్యాట్స్ మెన్ ?
x

ఢిల్లీ కెప్టెన్ ను ప్రకటించిన యాజమాన్యం.. ఆ డాషింగ్ బ్యాట్స్ మెన్ ?

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అన్ని జట్లకు కెప్టెన్ గా ఎవరో ఓ క్లారిటీ ఉంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కి మాత్రం ఇంతవరకూ నాయకుడు ఎవరో ప్రకటించలేదు..


ఐపీఎల్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కి రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ 14 నెలల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కి తిరిగి వస్తున్నాడు. ఈ మధ్య విశాఖపట్నంలో DC యొక్క ప్రీ-సీజన్ సన్నాహక శిబిరంలో పాల్గొని తన ఫిట్ నెస్, బ్యాటింగ్ వేగం తగ్గలేదని నిరూపించుకున్నాడు. దీనితో కెప్టెన్ గా పంత్ ను నియమించాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. 2022 డిసెంబర్ లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

ఈ సందర్భంగా డిసి ఛైర్మన్ సహ యజమాని పార్థ్ జిందాల్ మాట్లాడుతూ, “రిషబ్‌ను తిరిగి మా కెప్టెన్‌గా నియమిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. తన భయం లేని ఆట గేమ్ ను ఎల్లప్పుడు నిర్దేశిస్తునే ఉంటుంది. కొత్త శక్తితో మేము సీజన్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని'' ఆయన అన్నారు. అలాగే టీమ్ కో-ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి మాట్లాడుతూ, “రిషబ్ తన జీవితంలో అత్యంత సవాలుగా ఉన్న దశలో చాలా కష్టపడ్డాడు. కొత్త సీజన్‌ను ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. పంత్ నుంచి మిగిలిన క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ రిషబ్ టీమ్‌కి మా శుభాకాంక్షలు'' అన్నారు.
మార్చి 23న చండీగఢ్‌లో జరిగే IPL 2024లో DC తమ మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అంతకుముందు, ఈ ఏడాది ఐపీఎల్‌లో వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు పంత్‌కు బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది. ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా జట్టు శిబిరంలో పంత్ నెట్స్‌లో ఆడుతున్న తీరుకు ఫిదా అయ్యాడు.
"గత సంవత్సరం మేము పంత్ సేవలు కోల్పోయాము. మొత్తం టోర్నమెంట్ కూడా అతడి మెరుపులు కోల్పోయింది. రిషబ్ జట్టుకు చాలా శక్తిని తెస్తాడు. అతని ముఖంలో ఆ చిరునవ్వు ఉంది. అతను ఎప్పటిలాగే బాగా ఆడుతున్నాడు. బలంగా ధృడంగా తయారయ్యాడు," అని పాంటింగ్ అన్నారు
గత సంవత్సరం, ఆస్ట్రేలియన్ వెటరన్ డేవిడ్ వార్నర్ DCకి నాయకత్వం వహించాడు. అయితే మెరుగైన ఫలితాలు సాధించలేక తొమ్మిదో స్థానంతో లీగ్ ను ముగించారు.
Read More
Next Story