
విజయశాంతి ఆత్మహత్య మిస్టరీ వీడిపోయింది
కారులో దొరికిన పార్కింగ్ స్లిప్పు వెనుక విజయశాంతిరెడ్డి చేతిరాతతో ఒక లైన్ రాసుంది
సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసిన పిన్నింటి విజయశాంతిరెడ్డి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తల్లి, ఇద్దరు పిల్లలు జనవరి 31వ తేదీన (Charlapali)చర్లపల్లి రైల్వేస్టేషన్లోని గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై ఎన్నికోణాల్లో పోలీసులు విచారణ జరిపినా ఆత్మహత్యకు కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు. (Vijayasanti Reddy Suicide)విజయశాంతి సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవారు. లక్షరూపాయల జీతం, అద్దెలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డి, దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న భర్త సురేంద్రరెడ్డి. ఇవన్నీ చూసిన తర్వాత మృతురాలికి ఆర్ధికంగా, ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు లేవని అర్ధమవుతోంది.
ఇంట్లో ఆత్త, మామల పోరులేదు. ఆఫీసులో కూడా ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. అయినా ఎందుకని పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నది అన్న విషయం పెద్ద పజిల్ గా తయారైంది. మరింత లోతుగా దర్యాప్తుచేయటం కోసం ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. పోలీసులు ఫోన్, ల్యాప్ టాప్ ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తే ఓపెన్ కాలేదు. ఎందుకంటే మృతురాలు పాస్ వర్డ్ ను చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నది. అందుకనే వేరేదారిలేక ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాల్సొచ్చింది.
ల్యాబ్ లో అతికష్టంమీద ఫోన్, ల్యాప్ ట్యాప్ ను ఓపెన్ చేయగా అందులో కూడా పెద్దగా ఏమీ దొరకలేదు. అయితే ఒంటరితనంతో బాధపడుతున్నట్లు రెండు మూడు మెసేజీలు మాత్రం కనబడ్డాయి. ఒంటరితనం ఎందుకంటే పిల్లలేమో హాస్ట్ లో ఉండి చదువుకుంటున్నారు. భర్తేమో దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీసులో గడుపుతున్న విజయశాంతిరెడ్డి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని భరించలేకపోతోందని బందువులు కూడా పోలీసులకు చెప్పారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ దగ్గర కారును పార్క్ చేసిన మృతురాలు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవటానికి మధ్య 7 గంటల వ్యవధి ఉన్నది. ఆ 7గంటలు ముగ్గురూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరినైనా కలిశారా అన్నదే ఇప్పటికీ అంతుబట్టడంలేదు. కారులో దొరికిన పార్కింగ్ స్లిప్పు వెనుక విజయశాంతిరెడ్డి చేతిరాతతో ఒక లైన్ రాసుంది. ‘‘తనకు బతకాలని లేదని, తాను దూరమైతే పిల్లలు ఒంటరి అయిపోతారన్న కారణంగానే పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటున్నాను’’ అని రాసుంది. రాయటమే కాకుండా ఆ స్లిప్పును తన మొబైల్ లో వాట్సప్ స్టేటస్ సింబల్ గా ఉంచింది.
కొన్ని ప్రశ్నలు
ఇక్కడే పోలీసులకు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి, అవేమిటంటే :
1. నిజానికి ఒంటరితనం ఫీలవ్వాల్సిన అవసరం భార్యకు లేదని భర్త సురేంద్ర చెప్పాడు. అసలు ఒంటరితనం ఫీలయ్యేంత సమయం కూడా తన భార్యకు లేదన్నాడు.
2. ఉన్నత చదువులు చదివించే ఉద్దేశ్యంతోనే భార్య, భర్తలు మాట్లాడుకునే పిల్లలను హాస్టళ్ళల్లో ఉంచారు.
3. పిల్లల ఉన్నతచదవులకు బాగా డబ్బులు ఖర్చవుతాయన్న ఉద్దేశ్యంతోనే ఎక్కువ జీతం వస్తుందని భర్తను విజయశాంతి దుబాయ్ కు పంపింది.
4. భర్త దుబాయ్ లో ఉద్యోగం చేయటం, ఎక్కువ జీతం సంపాదించటాన్ని పక్కనపెడితే మృతిరాలికే ఐదెంకల్లో జీతం వస్తోంది. పైగా అద్దెల రూపంలో కూడా బాగా డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆర్ధిక సమస్యలు లేవని అర్ధమవుతోంది.
5. ఏసమస్యా లేకపోవటం కూడా విజయశాంతి సమస్యగా ఫీలైందా ? అన్నఅనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య డిప్రెషన్ వల్లే అని పోలీసులు తేల్చేశారు.

