వీహెచ్‌పీ నినాదం: ‘‘జో రామ్ కో లేకే ఆయే హై, హమ్ ఉన్కో లేకే ఆయేంగే’’
x

వీహెచ్‌పీ నినాదం: ‘‘జో రామ్ కో లేకే ఆయే హై, హమ్ ఉన్కో లేకే ఆయేంగే’’

అనుకున్న లక్ష్యం అంత సులువైనది కాదు. ఎన్నికల రణక్షేత్రంలో గెలవాలంటే పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. అదే ఇప్పుడు బీజేపీ చేస్తోంది.


భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్‌సభ ఎన్నికల ద్వారా మూడోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అనుబంధ సంస్థలు మద్దతు కూడా అవసరమని గుర్తించారు. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దాని అనుబంధ సంస్థలను రంగంలోకి దింపుతున్నారు.

వీహెచ్ పీ తీర్మానం..

మొదటి దశ పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండగా.. విశ్వహిందూ పరిషత్ (VHP) “ జో రామ్ కో లేకే ఆయే హై, హమ్ ఉంకో లేకే ఆయేంగే ” (రాముడిని తీసుకువచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటాం) అనే నినాదాన్ని లేవనెత్తింది. మార్చి 25 నుండి 27 వరకు అయోధ్యలో జరిగిన మూడు రోజుల సమావేశంలో రామ మందిర ప్రతిష్టకు కారకులైన నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు హిందూ మత పెద్దలతో పాటు సీనియర్ VHP నాయకులు తీర్మానించారు.

“రాముడిని అయోధ్యకు తీసుకువచ్చిన నాయకుడి గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే నిర్ణయాన్ని వీహెచ్‌పీ సీనియర్ నాయకులందరూ స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని సమావేశానికి హాజరైన పలువురు మత పెద్దలు కూడా సమర్థించారు. అలాగే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వెనుక కీలక పాత్ర పోషించిన నాయకుడిని వీలైనంత ఎక్కువ మంది ఓటర్లకు చేరువచేయాలని నిర్ణయించాం’’ అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ది ఫెడరల్‌తో అన్నారు.

100 శాతం ఓటింగ్..

అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) సమావేశం ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగింది. ఇందులో RSS సీనియర్ నాయకులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలలో 100 శాతం ఓటింగ్ జరిగేలా దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పరిషత్ లోని సభ్యులు, వారి కుటుంబసభ్యులంతా ముందుగా ఓటు వేయాలని, ఆపై బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు ఓటు హక్కును తప్పని వినియోగించుకోవాలని కోరుతూ ప్రచారం ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు.

వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ VHP ప్రణాళికను ది ఫెడరల్‌కు వివరించారు. “కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్ల వద్దకు వెళ్లండి. అయోధ్యకు రాముడిని తీసుకువచ్చిన నాయకుడికి ఓటు వేయాలని చెప్పండి. పోలింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనేలా ఓటర్లలందరిని అభ్యర్థించండి’’ అని వీహెచ్‌పీ సభ్యులకు మతపెద్దలు సూచించారని బన్సాల్ తెలిపారు.

వీహెచ్‌పీ నినాదం: జో రామ్ కో లేకే ఆయే హై, హమ్ ఉంకో లేకే ఆయేంగే

అనుకున్న లక్ష్యం అంత సులువైనది కాదు. ఎన్నికల రణక్షేత్రంలో గెలవాలంటే పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలి. అదే ఇప్పుడు బీజేపీ చేస్తోంది.అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం బీజేపీకి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట గురించి దేశవ్యాప్తంగా భారీగా ప్రచారం చేయడం వల్ల హిందువుల ఓట్లను ఆ పార్టీ కొల్లగొడుతుందని భావిస్తున్నారు.

“రామ మందిరం అంశం బిజెపికి లాభిస్తోందని పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఎందుకంటే అటు అగ్రవర్ణ ఓటర్లు ఇటు OBCలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో కనెక్ట్ కావడానికి ఇది సహాయపడుతుంది.” అని పంజాబ్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ ది ఫెడరల్‌తో అన్నారు.

అధికారంలో ఉన్న బీజేపీకి 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం. పార్టీ స్థాపించిన 44 ఏళ్లలో ఇచ్చిన కొన్ని ప్రధాన హామీలను నెరవేర్చింది. వాటిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి లడఖ్‌ను వేరు చేయడం, పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలు.

Read More
Next Story