బీహార్‌ సీఎం నితీష్‌ రాజీనామాపై ఉత్కంఠ..
x

బీహార్‌ సీఎం నితీష్‌ రాజీనామాపై ఉత్కంఠ..

బీహార్‌ సీఎం రాజీనామా చేయబోతున్నారా? ఎన్డీఏకు మళ్లీ జై కొడుతున్నారా? ఈ విషయం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది..


మహాఘటబంధన్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాజీనామాపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం (జనవరి 28) ఉదయం తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

కాగా శనివారం రాత్రికి నితీష్‌ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ పంపే అవకాశం ఉందని, లేదంటే ఆదివారం ఉదయానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం సన్నిహితుడొకరు చెప్పారు. అంతకంటే ముందు తన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.

సచివాలయాన్ని ఆదివారం తెరిచి ఉంచాలని కోరడం రాజీనామాకు బలం చేకూరుస్తుంది. కాగా జేడీ(యూ) చీఫ్‌ ‘మహాఘట్‌బంధన్‌’ నుండి నితీష్‌ వైదొలిగే వరకు ఆయనకు అధికారికంగా మద్దతు ప్రకటించకూడదని బీజేపీ నేతలు అగ్రనేతలు సూచించినట్లు తెలుస్తోంది. నితీష్‌ తాను రాజీనామా చేసే వరకు ‘‘అధికారిక ప్రకటన’’లు ఏమీ చేయవద్దని అగ్ర నాయకత్వం నుండి ఆదేశాలు అందాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తేల్చి చెప్పారు. అయితే బీహార్‌ ముఖ్యమంత్రి వారికంటే ఒక అడుగు ముందుకేశారు. కూటమికి పూర్తిమద్దతు ప్రకటిస్తూనే.. తాను రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇక తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తనకు మద్దతు ఇచ్చే మరికొందరితో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.


రాహుల్‌ యాత్ర సమాచారం ముందస్తుగా తెలపకపోవడంపై మమతా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రాకపోవడం, రాహుల్‌ పాదయాత్ర గురించి ముందస్తు సమాచారం లేకపోవడం కారణంగానే మమతా కూటమి దూరమైనట్లు తెలుస్తోంది.


టీఎంసీ బాటలోనే ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా అనుసరిస్తుంది. కూటమికి ఆ పార్టీ కూడా దూరమైనట్టే కనపడుతుంది. పంజాజ్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవత్‌ మాన్‌ ప్రకటించారు. పంజాబ్‌లో మొత్తం 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి.

నితీష్‌ కూడా..

తృణమూల్‌, ఆమ్‌ఆద్మీ పార్టీల వైఖరి పసిగట్టిన బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సైతం కూటమి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి ఎన్డీఏతో చేతులు కలుపుతారని సమాచారం.

Read More
Next Story