హిమాచల్ ప్రదేశ్‌ స్పీకర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎస్సీ
x

హిమాచల్ ప్రదేశ్‌ స్పీకర్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎస్సీ

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.


హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.
ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీకి ఓటు వేయలేదు. బీజేపీ నేత హర్ష్ మహాజన్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ. దేవిందర్ కుమార్ భుట ఓటు వేశారు. దాంతో హర్ష్ మహాజన్ గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ వేసిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ను కోరింది. ఆరుగురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రకటించిన నేపథ్యంలో దానిపై స్టే విధించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలుపుతూ విచారణను మే 6కు వాయిదా వేసింది. తిరుగుబాటుదారులపై అనర్హత వేటు వేయడంతో సభా బలం 68 నుంచి 62కి తగ్గగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 40 నుంచి 34కు పడిపోయింది.
Read More
Next Story