పదో పాసయినోళ్లకు  39,481 ఉద్యోగాలు రెడీ !
x

పదో పాసయినోళ్లకు 39,481 ఉద్యోగాలు రెడీ !

ప్రభుత్వ కొలువు సాధించడం నేటీ యువత కల. దాని కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగం సాధించే అవకాశం ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్..


కేవలం పదో తరగతి అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)తో పాటు కేంద్ర రక్షణ విభాగాలైన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)ల్లో మొత్తం 39,481 పోస్టులకు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), రైఫిల్‌మెన్, సిపాయి పోస్టులు..
ఈ నియామక పరీక్ష ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్‌ (జీడీ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో సిపాయి పోస్టులను భర్తీ చేస్తారు. ఈ క్రమంలో ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ (జీడీ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో సిపాయి పోస్టులను అఖిల భారత స్థాయిలో భర్తీ చేస్తారు. మిగతా విభాగాల పోస్టులకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థులను నియమిస్తారు.
విభాగాలవారీగా ఉద్యోగ ఖాళీలు, అర్హతల వివరాలు..
పదో తరగతి ఉత్తీర్ణతతోనే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చు. ఇందుకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, జీతభత్యాలు..
మొత్తం ఉద్యోగాలు: 39,481
విభాగాలవారీగా ఖాళీలు:
బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌): 15,654 (పురుషులు – 13,306, మహిళలు – 2,348)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 2,018, ఎస్టీ – 1,489, ఓబీసీ –2,906, ఈడబ్ల్యూఎస్‌ –1,330, అన్‌ రిజర్వుడ్‌ – 5,563
కేటగిరీలవారీగా మహిళల పోస్టులు:
ఎస్సీ – 356, ఎస్టీ – 262, ఓబీసీ –510, ఈడబ్ల్యూఎస్‌ –234, అన్‌ రిజర్వుడ్‌ – 986
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌): 7,145 (పురుషులు – 6,430, మహిళలు – 715)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 959, ఎస్టీ – 687, ఓబీసీ –1,420, ఈడబ్ల్యూఎస్‌ –644, అన్‌ రిజర్వుడ్‌ – 2,720
కేటగిరీలవారీగా మహిళల పోస్టులు:
ఎస్సీ –106, ఎస్టీ – 71, ఓబీసీ –156, ఈడబ్ల్యూఎస్‌ –74, అన్‌ రిజర్వుడ్‌ – 308
సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌): 11,541 (పురుషులు – 11,299, మహిళలు – 242)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 1,681, ఎస్టీ – 1,213, ఓబీసీ –2,510, ఈడబ్ల్యూఎస్‌ –1,130, అన్‌ రిజర్వుడ్‌ – 4,765
కేటగిరీలవారీగా మహిళల పోస్టులు:
ఎస్సీ – 34, ఎస్టీ – 20, ఓబీసీ –53, ఈడబ్ల్యూఎస్‌ –19, అన్‌ రిజర్వుడ్‌ – 116
సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ): 819 (పురుషులు – 819, మహిళలు –0)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 122, ఎస్టీ – 79, ఓబీసీ –187, ఈడబ్ల్యూఎస్‌ –82, అన్‌ రిజర్వుడ్‌ – 349
ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ): 3,017 (పురుషులు – 2,564, మహిళలు – 453)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 345, ఎస్టీ – 326, ఓబీసీ –505, ఈడబ్ల్యూఎస్‌ –197, అన్‌ రిజర్వుడ్‌ – 1,191
కేటగిరీలవారీగా మహిళల పోస్టులు:
ఎస్సీ – 59, ఎస్టీ –59, ఓబీసీ –90, ఈడబ్ల్యూఎస్‌ –21, అన్‌ రిజర్వుడ్‌ – 224
అస్సాం రైఫిల్స్‌: 1,248 (పురుషులు – 1,148, మహిళలు– 100)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ –124, ఎస్టీ – 223, ఓబీసీ –205, ఈడబ్ల్యూఎస్‌ –109, అన్‌ రిజర్వుడ్‌ – 487
కేటగిరీలవారీగా మహిళల పోస్టులు:
ఎస్సీ –9, ఎస్టీ – 21, ఓబీసీ –16, ఈడబ్ల్యూఎస్‌ –6, అన్‌ రిజర్వుడ్‌ – 48
సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌): 35 (పురుషులు –35, మహిళలు – 0)
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 5, ఎస్టీ – 3, ఓబీసీ –9, ఈడబ్ల్యూఎస్‌ –4, అన్‌ రిజర్వుడ్‌ – 14
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ):
11
కేటగిరీలవారీగా పురుషుల పోస్టులు:
ఎస్సీ – 0, ఎస్టీ – 1, ఓబీసీ –5, ఈడబ్ల్యూఎస్‌ –0, అన్‌ రిజర్వుడ్‌ – 5
అర్హతలు:
భారతీయ పౌరులై ఉండాలి.
జనవరి 1, 2025 నాటికి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి:
జనవరి 1, 2025 నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18–23 ఏళ్లు (జనవరి 2, 2002కి ముందు, జనవరి 1, 2007 తర్వాత జన్మించి ఉండకూడదు). ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎక్స్‌ సర్వీస్‌మెన్ల సంతానానికి కూడా మూడేళ్లు మినహాయింపు.
ఎంపిక విధానం:
మొత్తం ఐదు అంచెల్లో అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అవి.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), శారీరక ప్రమాణాల పరీక్ష (పీఎస్‌టీ), శారీరక సామర్థ్యాల పరీక్ష (పీఈటీ), మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.
వేతన శ్రేణి: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో సిపాయి పోస్టులకు ప్రారంభ పే స్కేల్‌ రూ.18,000 – రూ.56,900 (పే లెవల్‌ –1)తో ప్రారంభమవుతుంది. ఇక మిగతా విభాగాల పోస్టులకు ప్రారంభ పే స్కేల్‌ రూ.21,700 – రూ.69,100 (పే లెవల్‌ –3)తో మొదలవుతుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట మొబెల్‌ నంబర్‌ లేదా ఈమెయిల్‌ కు వచ్చే ఓటీపీ ద్వారా వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు రుసుం కింద రూ.100 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంది.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:
అక్టోబర్‌ 14, 2024 (రాత్రి 11 గంటల వరకు)
ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
అక్టోబర్‌ 15, 2024 (రాత్రి 11 గంటల వరకు)
ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో తప్పుల సవరణకు అవకాశం:
నవంబర్‌ 5 నుంచి 7 వరకు (రాత్రి 11 గంటల వరకు)
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష:
జనవరి – ఫిబ్రవరి 2025 (తేదీని త్వరలో ప్రకటిస్తారు). అడ్మిట్‌ కార్డులను పోస్టు ద్వారా పంపరు. అభ్యర్థులు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఎలా ఉంటుంది?

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ను మొత్తం ఇంగ్లిష్, హిందీతోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన భాషను ఎంచుకుని పరీక్ష రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకుని రాసే అవకాశాన్ని కల్పించారు.
పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి.. పార్టు ఏలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, పార్టు బీలో జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, పార్టు సీలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్టు డీలో ఇంగ్లిష్‌/హిందీలపై 20 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మొత్తం 160 మార్కులు కేటాయించారు. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ మల్టిఫుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. తప్పుగా ఇచ్చిన సమాధానాలకు 0.25 నెగెటివ్‌ మార్కుల కింద తీసేస్తారు. ప్రశ్నలన్నీ పదో తరగతి స్టాండర్డ్‌లోనే ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు ఎక్కడ?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
శారీరక ప్రమాణాల పరీక్ష:
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులో ఉత్తీర్ణులైనవారిని శారీరక ప్రమాణాల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలకు షార్ట్‌లిస్టు చేస్తారు. శారీరక ప్రమాణాల పరీక్షలో భాగంగా పురుషులు 5 కి.మీ దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది.
శారీరక ప్రమాణాల్లో భాగంగా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. అదేవిధంగా పురుష అభ్యర్థులు కనీసం 80 సెం.మీ ఛాతీ వైశాల్యాన్ని కలిగి ఉండాలి. ఎస్టీలకు ఈ అంశాల్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. శారీరక ప్రమాణాలు, శారీరక సామర్థ్యాల పరీక్షల్లో విజయం సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.gov.in


Read More
Next Story