‘ఎస్బీఐ’ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు మరోసారి ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్లకు ఆల్పా న్యూమరిక్ నంబర్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించింది
ఎన్నికల బాండ్ల వ్యవహరంలో మరోసారి ఎస్బీఐకీ సుప్రీంకోర్టు చివాట్లు వేసింది. రాజకీయ పార్టీలకు వచ్చిన బాండ్ల వివరాలలో అల్పా న్యూమరిక్ నంబర్లు లేవని ఈసీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల కేసులో మార్చి 11న జారీ చేసిన ఆర్డర్‌లోని ఆపరేటివ్ పోర్షన్‌ను సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం (ఈసీ) దాఖలు చేసిన దరఖాస్తును విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎస్బీఐని ఎందుకు వివరాలు ఇవ్వలేదని ప్రశ్నించింది.
అయితే కోర్టుకు అన్ని బాండ్లు సమర్పించామని తమ దగ్గర వేరే కాపీలు లేవని బ్యాంకు సమాధానం ఇచ్చింది. దాంతో తమ వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని స్కాన్ చేసి ఈసీకి సదరు వివరాలు అందించమని కోర్టు ఆదేశించింది. శనివారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిగా ఈసీకి అందజేయాలని రిజిస్ట్రీని కోరింది.
విచారణ సందర్భంగా, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, ఈ కేసులో పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, లాయర్ ప్రశాంత్ భూషణ్ చేసిన సమర్పణలను పరిగణనలోకి తీసుకుంది.
బ్యాంకుకు నోటీసులు జారీ చేసి మార్చి 18న విచారణకు వాయిదా వేసింది. అలాగే దీనిపై సమాధానం కూడా చెప్పాలని బ్యాంకును ఎస్బీఐ ఆదేశించింది.
విచారణ సందర్భంగా సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించిన పత్రాల కాపీలను EC కార్యాలయంలో నిర్వహించాలని మార్చి 11 ఆర్డర్‌లో పేర్కొన్నట్లు పోల్ ప్యానెల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది.
Next Story