అప్పుడు బ్రిటిష్ రాజ్.. ఇప్పుడు బిలియనీర్ రాజ్: కాంగ్రెస్
x

అప్పుడు బ్రిటిష్ రాజ్.. ఇప్పుడు బిలియనీర్ రాజ్: కాంగ్రెస్

బ్రిటిష్ రాజ్ లో కంటే బిలియనీర్ రాజ్ ల కాలంలో దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంగా ఆదాయ అసమానతలు పెంచే విధంగా ఆర్థిక విధానాలు అవలంభిచారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బ్రిటిష్ రాజ్ కంటే మోదీ అమలు చేస్తున్న బిలియనీర్ రాజ్ చాలా ప్రమాదకరంగా ఉందని విమర్శించింది.

భారత దేశంలో పెరుగుతున్న అసమానతలపై థామస్ పికెట్టీతో సహ పలువురు ప్రపంచ ఆర్థికవేత్తలు ప్రచురించిన ఓ నివేదికను ఉటంకించారు. "భారతదేశంలో ఆదాయం, సంపద అసమానతలు, 1922-2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనీర్ రాజ్" పేరుతో మార్చి 18 న ఓ నివేదికు ప్రచురించారు. ఇందులో పారదర్శకంగా పరిశోధనలు చేసి సమర్పించిన వివరాలు ఉన్నాయని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. దేశ సంపదను తన కార్పొరేట్ మిత్రులకు పంచుతున్నాడని, ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని వారి దగ్గరి నుంచి నిధులు సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఒక శాతం ఉన్న సంపన్నులు ఆర్జించే సంపద జాతీయ ఆదాయంలో అత్యధికంగా కనిపిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా మనదేశ కార్పొరేట్ల వాటా ఇందులో ఎక్కువగా ఉందన్నారు.
ముఖ్యంగా 2014 - 2023 మధ్యకాలంలో అసమానత పెరుగుదల బాగా ఉంది, ఇది "దస్ సాల్ అన్యాయ్ కాల్"కి అనుగుణంగా ఉందని విమర్శించారు. మోడీ ప్రభుత్వ విధానాలు ఈ వికృతమైన వృద్ధికి కారణమైయ్యానని అన్నారు. ఇందుకు మూడు సూత్రాలను ఉపయోగించారని విమర్శించారు. ధనికులను సంపన్నం చేయడం, పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టడం, డేటాను దాచిపెట్టడని విమర్శించారు.

"మోదీ సర్కార్ ఆర్థిక విధానాలన్నీ కూడా బిలియనీర్లకు సంపదను సృష్టించడంపై దృష్టి సారించాయి. చాలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు రికార్డు రాయితీలకు అదే కార్పొరేట్లకు అమ్ముకుంటున్నారు," అని ఆయన ఆరోపించారు.
"చాందా దో, ధండాలో పథకం కింద ఈ కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో అధికార పార్టీకి విరాళాలు ఇస్తున్నాయని కూడా ఇప్పుడు మనకు తెలుసు. డీమోనిటైజేషన్, ప్రణాళిక లేని జిఎస్‌టి అమలు, పర్యావరణ, భూసేకరణ, వ్యవసాయ, బిలియనీర్ రాజ్‌కు మద్దతు ఇవ్వడానికి కార్మిక చట్టాలన్నీ పక్కకు నెట్టబడ్డాయి ”అని రమేష్ పేర్కొన్నారు.
"2015లో, ఒక సామాన్యుడు వస్తువులపై రూ. 100 ఖర్చు చేస్తే, వ్యాపార యజమానికి రూ. 18 లాభం వచ్చేది, ఇప్పుడు యజమానికి రూ. 36 లాభాలు వస్తున్నాయి. ఈ పెరుగుదల ధరలు, నిరుద్యోగ సంక్షోభం ఏర్పడటానికి కారణమైంది. సామాన్యుల నిజమైన వేతనాలు స్తబ్దతగా మారాయి" అని రమేష్ అన్నారు.
ప్రభుత్వం 2021 జనాభా గణనను నిర్వహించడంలో విఫలమైంది, 2011 సామాజిక ఆర్థిక కుల గణనను ప్రచురించడానికి నిరాకరించింది, GDP గణాంకాలను తారుమారు చేసింది. నేషనల్ శాంపిల్ సర్వే (NSS) 2017-18 వంటి అసౌకర్య డేటాను బయటకు రాకుండా చేసింది. గ్రామీణ వినియోగ వ్యయం అనూహ్యంగా తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ పచీస్ హామీలు దేశ అసమానతలకు ప్రత్యక్ష ప్రతిస్పందన" అని ఆయన అన్నారు.


Read More
Next Story