ఎన్నికల తరువాత కొత్త రాహుల్ గాంధీ కనపడుతున్నాడు? నిజమేనా?
x

ఎన్నికల తరువాత కొత్త రాహుల్ గాంధీ కనపడుతున్నాడు? నిజమేనా?

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో సారి అధికారానికి దూరమైంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం తన రాజకీయంగా చాలా యాక్టీవ్ గా మారాడు.


రాజకీయంగా విఫలమైన నేత గా ముద్ర పడ్డారు. రాజకీయాలంటే ఇష్టం లేనట్లు వ్యవహరిస్తారని పేరుంది. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన చాలా బిజీగా మారిపోయారు. ఇవన్నీ ఎవరి గురించి చెబుతున్నారో మీకు ఆ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయనే రాహుల్ గాంధీ.

లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు కొత్తగా హోదా లభించిన పర్యవసానమా? లేక ఇది భారత్ జోడో యాత్రకు కొనసాగింపా? తెలియదు కానీ మొత్తానికి మనిషి మాత్రం మారినట్లు కనిపిస్తోంది. రాజకీయం ఒంటబట్టినట్లే అనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చిందనే చెప్పాలి. ఈ రాయ్ బరేలీ ఎంపీ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలతో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు.

బిజీ రాహుల్
గత నెల రోజులుగా, రాహుల్ లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభియోగాలకు నాయకత్వం వహించారు. అనేక సమస్యలపై ప్రధానమంత్రికి వ్యతిరేకంగా తన ప్రసంగం కొనసాగించారు. లోక్ సభ బయట కూడా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు.
హత్రాస్ లో ఎస్పీ పార్టీకి మద్ధతు ఇచ్చే భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. తరువాత జాతుల ఘర్షణలో అట్టుడుకుతున్న మణిపూర్ ను సందర్శించారు. ఈశాన్య రాష్ట్రంలో జరిగిన అశాంతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎల్ ఓపీ గా లోక్ సభ లో ప్రసంగం వల్ల గుజరాత్ లో బీజేపీ- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గుజరాత్ లో కూడా పర్యటించారు.
బీజేపీ పై ఒత్తిడి..
రాహూల్ గాంధీ తరుచుగా రాయ్ బరేలీలో పర్యటిస్తూనే ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూనే ఉన్నాడు. భారత్ జోడో యాత్రను కొనసాగింపుగా న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్ లోని లోక్ ఫైలెట్లతో మాట్లాడటం, నీట్ పరీక్ష రద్దు చేయాలనే ఆందోళనలు, అగ్నివీర్ రద్దు చేయాలనే పోరాటాలు చేస్తున్నారు. వీటన్నింటి వల్ల అర్థమయ్యే విషయం ఏమిటంటే నరేంద్ర మోదీ కి ప్రజల్లో బలం ఉందని తరుచుగా వ్యాఖ్యానించే బీజేపీ ఎకో సిస్టమ్ ఇప్పుడు ఆలోచనల్లో పడింది.
అప్పట్లో లాగా ఏకపక్షంగా ఉండదు...
అయితే ఈ విషయాలను కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంగీకరించడం లేదు. కొత్త రాహుల్ గాంధీ లేదా నాయకుడిగా ఇమేజ్ మేకోవర్ గా చేస్తున్నారనే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన సాగించిన రాజకీయ దృక్పథాన్ని కొనసాగించడం మాత్రమే అని వారంతా గట్టిగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక నెల తర్వాత కూడా రాహుల్ దూకుడు రాజకీయ ప్రస్థానం అతని మునుపటి ట్రాక్ రికార్డ్‌కు భిన్నంగా ఉంది.
కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోయినప్పటికీ తన పార్టీ లేవనెత్తిన సమస్యలపై రాహుల్ గాంధీ దృఢ నిర్ణయంతో ఉన్నారని ఆయన రాజకీయ ఎత్తుగడలు తెలియజేస్తున్నాయి. లోక్ సభ లో సామీప్యత ఉన్న పార్టీలను కలుపుకుని ఆయన దూకుడుగా వెళ్తున్నారు. వచ్చే ఐదేళ్లలో పార్టీని పునర్జుజీవనం చేసేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇదే సంకేతాన్ని ఆయన కార్యకర్తలకు ఇస్తున్నాడు.
ఇప్పుడు మరింత..
“గత 20 సంవత్సరాలుగా మీడియా లోని ఒక విభాగం సాయంతో బిజెపి ఓ అభిప్రాయాన్ని ఏర్పరిచింది. రాహుల్ ఏ పని చేసిన ఇమేజ్ మేకోవర్ అని ఆయనకో బ్రాండ్ వేశారు. వాస్తవం ఏమిటంటే.. రాహుల్ ఈ రోజు చేసేది.. గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఏమి లేదు. ముఖ్యంగా మొదటి భారత్ జోడో యాత్ర నుంచి ఆయన ఇవే పనులు చేస్తున్నాడు ”అని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి ఫెడరల్‌తో అన్నారు.
కొన్ని రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఒక నాయకుడు మాట్లాడుతూ.. “పార్టీలో మేము కోరుకునే విషయం ఏమిటంటే, రాహుల్ పై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మారడం, ఆయనకు ఇష్టం లేకున్నా కానీ సీడబ్ల్యూసీ కోరగానే లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అంగీకరించారు. వయనాడ్ ఎంపీగా ఉండటానికి ఆయన మొగ్గు చూపాడు. అయినప్పటికీ పార్టీ నిర్ణయంతో రాయ్ బరేలీ స్థానంలో ఉండటానికి ఒప్పుకున్నాడు.
తీర్పు ఏమిటి?
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనప్పటికీ బీజేపీకి మాత్రం చుక్కలు చూపించడంలో సఫలం అయ్యాడు. “మేము ఫలితాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ కు సొంత లాభాలు పెద్దగా లేవు, అయితే ఎన్నికల ఫలితాల నుంచి పెద్ద టేకవే ఏమిటంటే, మోదీ అజేయుడు అనే భావన విచ్ఛిన్నమైంది. ఇవి ముఖ్యంగా రాహుల్‌కు భారీ షాట్; రాబోయే కొద్ది నెలల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మేము సాధించిన ఊపును కొనసాగించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మోదీపై మా దాడిని మరింత తీవ్రతరం చేయడానికి ఇదే సరైన సమయమని రాహుల్ భావించవచ్చు” అని మరో కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయపడ్డారు.
ఊపందుకుంటున్నది..
రెండు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన నిర్వహించిన తొలి రాజ్యాంగ పదవికి తనకు తానే అర్హుడిని అని నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. "LPగా ఉండటం లోక్‌సభ కార్యక్రమాలలో తన ప్రమేయానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక విధంగా ఆయనను నేరుగా మోదీ సరసన నిలబెట్టే బృహత్తర బాధ్యత. అంతేకాకుండా, లోక్‌సభ ఫలితాల తర్వాత తనకు, కాంగ్రెస్‌కు గుడ్‌విల్ పెరిగిందని, అది క్షీణించడం ప్రారంభించకముందే దానిని సద్వినియోగం చేసుకోవాలని రాహుల్ అర్థం చేసుకున్నాడు, ”అని రాహుల్ కు సన్నిహితంగా పనిచేసిన ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
లోక్‌సభకు తన సెక్రటేరియట్‌గా పనిచేసే వ్యక్తులను రాహుల్ గుర్తించారని, పార్లమెంటు లోపల, వెలుపల మోదీ పాలనను స్తంభింపజేయడానికి అతనికి స్థిరమైన సమాచారాన్ని అందించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోకో పైలట్‌లు, నిర్మాణ కార్మికులతో కలిసిపోవడం, అలాగే వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడటం, ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా, సామాజికంగా అణచివేతకు గురైన వారితో కలవడానికి ఆసక్తిగా ఉన్నాడు.
కాంగ్రెస్‌కు పునర్వైభవం..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇంకా ప్రకటించని వాయనాడ్ ఉప ఎన్నికలో తన ఎన్నికల అరంగేట్రం చేయబోతున్న ప్రియాంక గాంధీతో కలిసి, రాహుల్ కూడా కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసే ప్రయత్నాలలో సీరియస్ గా ఉన్నారు. వివిధ అసెంబ్లీ ఎన్నికల కోసం దాని వ్యూహాన్ని రచించే ప్రయత్నాలలో పాల్గొంటారు. మరీ ముఖ్యంగా, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ సన్నిహితుడు మాట్లాడుతూ “పార్టీకి ఆయన సైద్ధాంతిక వ్యాఖ్యాతగా ఉంటారు. హిందూమతం నుంచి BJP మిలిటెంట్ హిందుత్వను వివరించడం, ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం రక్షకునిగా బాధ్యత తీసుకోవడం ముఖ్యం. ఇలాంటి అనేక విషయాలపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయడం ముఖ్యం.
Read More
Next Story