‘కుట్ర బయటపెట్టానని దూషించడం మొదలుపెట్టారు’
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..దేశ సంపదను దోచి ఒక వర్గానికి పంచి పెడతారన్న మోదీ వ్యాఖ్యలు ఇప్పడు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ప్రజల సంపదను దోచుకుని "ఎంపిక చేసుకున్న వారికి పంచడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆదివారం రాజస్థాన్‌లోని బన్స్వారాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ 'సంపద పునర్విభజన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను మంగళవారం టోంక్‌లో నిర్వహించిన ర్యాలీలో మరోసారి గుర్తు చేశారు.
‘‘ రెండు మూడు రోజుల క్రితం, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెట్టాను. నా వ్యాఖ్యలు కాంగ్రెస్ భారత కూటమికి కోపం తెప్పించాయి. దాంతో వారు ప్రతిచోటా మోదీని దూషించడం మొదలుపెట్టారు.సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాసి ఉంది. కాంగ్రెస్ రహస్య ఎజెండా బయలు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు వణుకుతున్నారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా పరిగణిస్తారు.’’ అని మోదీ పేర్కొన్నారు.
Next Story