ఈ సారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, న్యూయార్క్ లో..
x

ఈ సారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, న్యూయార్క్ లో..

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు ఈసారి అమెరికా ఆర్థిక రాజధాని ఆతిథ్యం ఇవ్వనుంది.


వచ్చే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్- పాకిస్తాన్ లు ఈ సారి ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఇరు జట్లు జూన్ 9న న్యూయార్క్ వేదికగా తలపడనున్నాయి. దీంతో మరోసారి హోరాహోరీ పోరు తప్పదని అంచనాలున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది.

ప్రపంచకప్ గెలవకపోయిన అభిమానులు పెద్దగా బాధపడరు, కానీ దాయాదులతో జరిగే పోరులో మాత్రం ఓడిపోతే తట్టుకోలేరు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేయడం, వెక్కిరించడం, మాజీల నుంచి విమర్శలు వాటిని తట్టుకోవడం ఇరు జట్లకు కష్టమే.

ఈ సారి ప్రపంచకప్ కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అందువల్ల కొన్ని మ్యాచ్ లు అమెరికాలో జరగనున్నాయి. టోర్నీ జూన్ 1న ప్రారంభమై అదే నెలా 29న ముగుస్తుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు మరో జట్టుతో నాలుగు మ్యాచ్ లు ఆడనుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు తరువాత జరిగే నాకౌట్ కు అర్హత సాధిస్తాయి. తరువాత సెమీ ఫైనల్, ఫైనల్ జరగుతుంది.

టోర్నీ కోసం ఆరు వేదికలు కరేబియన్ దేశాల్లో ఉండగా, మరో మూడు డల్లాస్, లాడర్ హిల్, న్యూయార్క్ అమెరికాలో ఉన్నాయి. మొత్తం పది జట్లు తమ మొదటి మ్యాచ్ లను అమెరికాలోనే ఆడనున్నాయి. భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు లాంగ్ ఐలాండ్ లోని క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

41 మ్యాచ్ లు కరేబియన్ దీవుల్లో జరుగుతాయి. సెమీఫైనల్ ట్రినిడాడ్ అండ్ టోబాగో, గయానా వేదికగా, ఫైనల్ బార్భడోస్ లో జరగనుంది. సెమీఫైనల్, ఫైనల్ మాత్రమే రిజర్వ్ డే ఉంది. మొదటి మ్యచ్ యూఎస్ఏ తో కెనడా తలపడనుంది. కాగా టీ20 డిఫెండింగ్ చాంఫియన్ ఇంగ్లాండ్.

టీ20 ప్రపంచకప్ గ్రూప్

గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్,కెనడా, యూఎస్ఏ

గ్రూప్ B: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ C: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉంగాండా, పుపువా న్యూగినియా,

గ్రూప్ D: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్, నేపాల్

ప్రతి గూప్ నుంచి రెండు జట్లు నాకౌట్ కు చేరుకుంటాయి.

భారత్ ఆడే మ్యాచ్ లు

భారత్ VS ఐర్లాండ్ - జూన్ 5, న్యూయార్క్

భారత్ VS పాకిస్తాన్- జూన్ 9, న్యూయార్క్

భారత్VS యూఎస్ఏ- జూన్ 12,న్యూయార్క్

భారత్ VS కెనడా- జూన్ 15, ఫ్లోరిడా





Read More
Next Story