ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతం
x

ఈ ఏడాది జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతం

అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం, తయారీ, సేవా రంగాల బలమైన పనితీరే కారణం పెరుగుదలకు కారణం


ఈ ఏడాది(2025-26) భారత ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం 6.5 శాతంగా ఉంది. తయారీ, సేవా రంగాల బలమైన పనితీరు కనపరచడంతో జీడీపీ కూడా అనుకున్న దానికంటే ముందుకు దూసుకువచ్చింది.

గణాంకాల మంత్రిత్వ శాఖ(ఎంఎస్పీఐ) విడుదల చేసిన జాతీయ ఆదాయం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో తయారీ, నిర్మాణ రంగాలు రెండు ఏడు శాతం వృద్దిని నమోదు చేస్తాయని అంచనా వేసింది.

సేవలు కీలకంగా..
2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వాస్తవ జీవీఏ(స్థూల విలువ ఆధారిత) వృద్ధిరేటు అంచనాలకు మించి పెరగడానికి ప్రధాన కారణం సేవలరంగం దూసుకుపోవడమే అని వెల్లడైంది. ఇది వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా పనిచేసింది.
ఆర్థిక రంగాలు, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలు,, స్థిర ధరల వద్ద 9.9 శాతం వృద్ధి సాధిస్తాయని అంచనా వేశారు. వాణిజ్యం, హెటళ్లు, రవాణా,కమ్యూనికేషన్ ప్రసారాలు, ఇతర సేవలు వంటివి 7. 5 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనాలు ఉన్నాయి.
పారిశ్రామిక పనితీరు ఆశాజనకంగా ఉండటం, మౌలిక సదుపాయాల ద్వారా ద్వితీయరంగం కూడా వృద్ధికి సహయపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు తయారీ రంగం, నిర్మాణ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రాథమిక రంగం..
ఈ రంగాలకు విరుద్దంగా ప్రాథమిక రంగం సాపేక్షికంగా నెమ్మదిగా వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా. వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు 2025-26 లో 3.1 శాతం పెరుగుతాయని అంచనా వేయగా, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు 2.1 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. ఈ రంగం ద్వితీయ, తృతీయరంగాల కంటే వెనకబడి ఉంది.
వినియోగం, పెట్టుబడులు..
ఖర్చుల వైపు నుంచి పరిశీలిస్తే ప్రయివేట్ వినియోగ వ్యయం పెరిగింది. అలాగే స్థిరమైన గృహ వ్యయంతో నిజమైన ప్రయివేట్ తుది వినియోగ వ్యయం 7 శాతం పెరుగుతుందని అంచనా. పెట్టుబడి కార్యకలాపాలు కూడా బలంగా ఉన్నాయి. స్థూల స్థిరమూలధన నిర్మాణం(జీఎఫ్సీఎఫ్) గత సంవత్సరం 7. 1 శాతం నుంచి 7.8 శాతం పెరుగుతుందని అంచనా
జీడీపీ పెరుగుదల..
ప్రస్తుత జీడీపీ ధరల వద్ద జీడీపీ 2025-26 లో 8 శాతం పెరిగి రూ. 357. 14 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది గత ఆర్థిక సంవత్సరంలో రూ. 330.68 లక్షల కోట్లుగా ఉంది. నామమాత్రపు జీవీఏ 7.7 శాతం పెరుగుతుందని అంచనా. తలసరి జీడీపీ రూ. 1,42,119 గా అంచనాలు ఉన్నాయి.
ఇది సంవత్సరానికి 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అనుకుంటున్నారు. ఈ అంచనాలు అన్నీ బెంచ్ మార్క్ ఇండికేటర్ పద్దతిని ఉపయోగించి ప్రకటించారు. జాతీయ ఖాతాల మూల సంవత్సరాన్ని(బేస్ ఇయర్) 2011-12 నుంచి 2022-23కి మార్చినందున, రెండో ముందస్తు అంచనాలు ఫిబ్రవరి 27, 2026న విడుదల కానున్నాయని, కావునా గణాంకాలు సవరించే అవకాశం ఉందని ఎంఎస్పీఐ హెచ్చరించింది.
Read More
Next Story