కేరళలో త్రిముఖ పోటీ..గెలుపుపై ఎవరి ధీమా వారిది..
x

కేరళలో త్రిముఖ పోటీ..గెలుపుపై ఎవరి ధీమా వారిది..

కేరళలోని అరుదైన నియోజకవర్గాల్లో తిరువనంతపురం ఒకటి. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.


కేరళలోని అరుదైన నియోజకవర్గాల్లో తిరువనంతపురం ఒకటి. ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి చంద్రశేఖర్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) నుంచి మాజీ ఎంపి పన్నియన్ రవీంద్రన్ బరిలో నిలుస్తున్నారు.

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) అభ్యర్థి రవీంద్రన్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. వారం క్రితం ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో వెంటనే ప్రచారంలోకి దిగారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం రాజధాని నగరానికి చేరుకున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ (కాంగ్రెస్) నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమావేశాల్లో పాల్గొంటున్నారు.

అందరూ బయటివారే..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తిరువనంతపురం నుంచి బరిలో నిలుస్తున్న ముగ్గురు అభ్యర్థులు స్థానికులు కాదు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన థరూర్ పాలక్కాడ్ జిల్లాకు చెందినవారు. రవీంద్రన్ కన్నూర్‌కు చెందినవారు కాగా, చంద్రశేఖర్ త్రిసూర్ జిల్లాకు చెందినవారు. తిరువనంతపురంలో త్రిముఖ పోటీ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఇంకా తన ప్రచారాన్ని ప్రారంభించలేదు. కానీ థరూర్ మాత్రం తిరువనంతపురంలో వివిధ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ప్రముఖులతో సమావేశమై గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం..

ఇటీవల జంతు దాడుల్లో తొమ్మిది మంది చనిపోయారు. వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థి సిద్ధార్థన్ మరణం, ఉద్యోగుల జీతాల పంపిణీలో జాప్యానికి దారితీసిన ఆర్థిక పరిస్థితులను జనంలోకి తీసుకెళ్లి పినరయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లను కొల్లగొట్టాలన్నది కాంగ్రెస్, యుడిఎఫ్ వ్యూహం. అందులో భాగంగానే సందర్భానుసారంగా నిరసనలు నిర్వహిస్తున్నారు.

సిద్ధార్థన్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ యూత్‌ కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, కేఎస్‌యూ అధ్యక్షురాలు నిరాహారదీక్ష చేపట్టారు. తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయం ముందు కాంగ్రెస్‌, యూడీఎఫ్‌లు నిరసనకు దిగాయి కూడా.

థరూర్ మద్దతు..

సివిల్ పోలీస్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ర్యాంక్ హోల్డర్లు చేపట్టిన దీక్షకు థరూర్ మద్దతు తెలిపారు. “కేరళ PSC పోలీస్ కానిస్టేబుల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి అన్యాయం జరిగిందని ప్రసంగించాను.

కాంగ్రెస్ పార్టీ ఈ వారంలో తన అభ్యర్థులను ప్రకటించనుంది. మార్చి 11న అధికారిక ప్రచారం ప్రారంభమవుతుంది. KPCC అధ్యక్షుడు K సుధాకరన్, ప్రతిపక్ష నాయకుడు VD సతీశన్ పార్టీ హైకమాండ్‌తో చర్చల కోసం ఢిల్లీకి వెళ్లారు.

ప్రచారంలో చంద్రశేఖర్..

రాజీవ్ చంద్రశేఖర్ కు బిజెపి కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'ముండు' సగం కుర్తా ధరించిన చంద్రశేఖర్ థరూర్ శైలిని గుర్తుకు తెస్తూ.. కొంచెం ఆంగ్లీకరించిన యాసతో మలయాళంలో మాట్లాడాడు. అనంతరం జర్మన్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

బీజేపీ హామీలు..

‘‘ఒక మలయాళీగా, కేరళలో ఫ్యాక్టరీలు, టెక్ హబ్‌లు లేకపోవడం నిరుత్సాహ పరుస్తుంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నాం. కొత్త నైపుణ్యాలు, సంపాదన మార్గాలను చూపిస్తాం ”అని చంద్రశేఖర్ అంటున్నారు. మన ప్రధాని వచ్చే ఐదేళ్లలో తిరువనంతపురంలో ప్రతి మలయాళీ యువకుడికి నైపుణ్యంతో పాటు అందుకు తగ్గట్టుగా ఉద్యోగావశాలు కల్పిస్తారని హామీ ఇస్తున్నారు. పట్టణ ఓటర్లలో ఎక్కువ మంది యువ సాంకేతిక నిపుణులు కావడంతో వారి ఓట్లను ఈజీగా రాబట్టగలరని బీజేపీ విశ్వసిస్తోంది. గాజా వివాదంలో థరూర్ వైఖరి కారణంగా మైనారిటీ ఓట్లు రవీంద్రన్, థరూర్ మధ్య చీలిపోతాయని బీజేపీ భావిస్తోంది.

NDA, UDF అభ్యర్థులు ఇద్దరూ పట్టణ ఓటర్లపై దృష్టి సారిస్తుండగా, LDF రాజధాని నగరంలోని సామాన్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అనుభవజ్ఞుడైన కమ్యూనిస్ట్ రవీంద్రన్ వైపు మొగ్గు చూపింది.

రవీంద్రన్ గురించి..

రవీంద్రన్ ఉత్తర జిల్లా కన్నూర్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ తన పార్టీకి సహాయ కార్యదర్శిగా తిరువనంతపురంలో చాలా కాలంగా ఉంటున్నారు. వాహనం కూడా లేని వ్యక్తి. రాకపోకలకు ప్రజా రవాణాను ఉపయోగించడానికి వెనుకాడని వ్యక్తి. రవీంద్రన్.

కాన్ఫిడెంట్‌గా ఎల్‌డిఎఫ్..

“ఈసారి మేం చాలా నమ్మకంగా ఉన్నాం. నగరంలో జరిగిన కొన్నికార్యక్రమాలు మినహా థరూర్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరన్న విషయం సాధారణ పౌరులకు తెలుసు. గతంలో

రాజకీయ పరిస్థితులు ఆయన కలిసొచ్చాయి. అయితే ఈ సారి పరిస్థితులు మారిపోయాయి. సామాన్య ప్రజలు మనకు అనుకూలంగా మారడాన్ని మేం గమనిస్తున్నాం”అని సిపిఐ (ఎం) నాయకుడు, మాజీ నగర కార్పొరేషన్ కౌన్సిలర్ ఐపి బిను అన్నారు.

"టెక్నోపార్క్ ఏరియాలోని ఒక చిన్న సెక్షన్ టెక్కీలకు తప్ప చంద్రశేఖర్ నిజంగా ఎవరికి తెలుసు?" అతను అడిగాడు. "అతనితో పరిచయం ఉన్నవారు అతని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి అవకాశంలోనూ కేరళను మోసం చేసిన మతతత్వవాది."

LDF ముందున్నసమస్యలు..

ఎల్‌డిఎఫ్ ఎదుర్కొనే ప్రధాన సమస్య రాష్ట్ర ఆర్థిక సంక్షోభం. దీన్ని అవకాశంగా తీసుకునేందుకు యుడిఎఫ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మార్చి 5 నాటికి కూడా మాకు ఫిబ్రవరి జీతాలు అందలేదు’’ అని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

క్రాస్ ఓటింగ్?

గత రెండు ఎన్నికలలో థరూర్ సాధించిన ముఖ్యమైన విజయాలకు వామపక్ష కార్యకర్తల క్రాస్ ఓటింగ్ కారణమని చాలా మంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం 72 ఏళ్ల చరిత్రలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తుతో సీపీఐ విజయంతో పాటు వామపక్షాలు మూడుసార్లు మాత్రమే గెలిచాయి. 2009 నుండి, థరూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 2014, 2019లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిలో ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నగర కార్పొరేషన్‌తో సహా మెజారిటీ స్థానిక స్వపరిపాలనలు ఎల్‌డిఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నాయి.

Read More
Next Story