
పులి సంచారం : అటవీ గ్రామాల్లో భయం భయం (ఫొటో కర్టసీ : అటవీశాఖ కెమెరా ట్రాప్ చిత్రం)
మూడు నెలల్లో 8 జిల్లాలు చుట్టేసిన పులి: ఇప్పుడు ఆదిలాబాద్‌లో హల్‌చల్
పులి కదలికలతో అలర్ట్ అయిన అటవీశాఖ… గ్రామస్థులకు జాగ్రత్త సూచనలు
మూడు నెలలుగా పలు జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న పులి మరోసారి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం కనిపించింది. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తాంసి మండలంలో పులి పాదముద్రలు కనిపించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి కదలికలను అటవీశాఖ అధికారులు నిశితంగా గమనిస్తూ గ్రామస్థులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.పులి కదలికలను అటవీశాఖ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల విరామం తర్వాత మరోసారి పులి కదలికలు కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.మహారాష్ట్ర సరిహద్దుల్లోని తాంసి మండలంలో పులి ప్రత్యక్షమైంది. గుంజాల, ధనోరా గ్రామాల సమీపంలో పులి పుగ్‌మార్క్‌లు కనిపించడంతో రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఆహారం కోసం పులి పొలాల్లోకి తిరుగుతుండవచ్చని రైతులు చెబుతున్నారు. అటవీ గ్రామాల సమీపంలో పులుల సంచారంతో మానవ-జంతు సంఘర్షణను నివారించడానికి ఫారెస్ట్ ట్రాకింగ్ బృందాలు పనిచేస్తున్నాయని, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.రెండు రోజుల క్రితం జగిత్యాల నుంచి పులి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. పులి సంచారం నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పొలాల్లో ఒంటరిగా తిరగకుండా ఉండాలని, రాత్రిపూట ఇంట్లోనే ఉండాలని సూచించారు.
కవాల అభయారణ్యం వైపు పులి ప్రయాణం
జనవరి నెలలో యాదాద్రి భువనగిరి పరిసర జిల్లాల్లో సంచరించిన పులి తనకంటూ అడవిలో భూభాగాన్ని స్థాపించడంలో విఫలమైన తర్వాత తిరుగు ప్రయాణాన్ని కవాల అభయారణ్యం వైపు ప్రారంభించింది.పులి గత మూడు నెలల్లో 8 జిల్లాల్లో 24కు పైగా ప్రదేశాలలో పశువులను చంపింది. పులి కదలికను నిశితంగా పర్యవేక్షించడానికి,మానవ-జంతు సంఘర్షణ ప్రమాదాన్ని తగ్గించడానికి అటవీ శాఖ ట్రాకింగ్ బృందాలను అటవీశా నియమించింది.అటవీశాఖ అధికారులు కెమెరాట్రాప్ లతో పాటు జంతు ట్రాకర్‌లను ఉపయోగించడం ద్వారా పులి కదలికను ట్రాక్ చేయడానికి యత్నిస్తున్నారు. ఈ పులి కవాల అభయారణ్యంలోకి వెళ్లిందా ? లేదా పొరుగున ఉన్న మహారాష్ట్ర అడవులలోకి వెళ్లిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. యావత్మల్ జిల్లాలోని తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం (టిపిఎస్) నుంచి ఒక పులి 15రోజుల రోజుల క్రితం పెన్‌గంగా నది దాటి ఉండవచ్చని అటవీ అధికారులు చెప్పారు.నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి ఫారెస్ట్ రేంజ్ లో గురువారం ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న అటవీశాఖ అధికారులకు పులి కనిపించింది. గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద పులి ఉన్నట్లు కెమెరా ట్రాప్ చిత్రం రికార్డు చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు పులి కదలికలను గుర్తించేందుకు వీలుగా డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. కల్వర్టు వద్ద పులి కనిపించడంతో అటవీశాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.
ఖమ్మం అడవుల్లో చిరుతపులి సంచారం
ఖమ్మం అడవుల్లో వన్యప్రాణులు వృద్ధి చెందాయని తాజాగా విడుదలైన కెమెరా ట్రాప్ చిత్రాల్లో తేలింది.అడవుల్లోని కెమెరా ట్రాప్‌లలో చిరుతపులి, స్లోత్ బేర్, చుక్కల జింకలు కనిపించాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి కామారెడ్డి మండలంలోని కోనాపూర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోకి పులి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఇనాయత్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి కదలికలను అధికారులు నిర్ధారించారు. ఇనాయత్‌నగర్ గ్రామ శివార్లలోని గట్టు పోచంపాడ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 14లో పులి పాదముద్రలను గుర్తించారు. పులి ఇనాయత్‌నగర్ కంపార్ట్‌మెంట్ నుంచి మాల్యాల్-చందుర్తి రేంజ్ పరిధిలోని మానాల అటవీ ప్రాంతం వైపు కదిలిందని అధికారులు నిర్ధారించారు.
ఎలుగుబంటి చిత్రం రికార్డు
కవాల్ టైగర్ రిజర్వ్‌లోని అటవీ ట్రాక్‌లో స్లోత్ ఎలుగుబంటి రెండు పిల్లలను తన వీపుపై మోసుకెళుతుండగా కెమెరా ట్రాప్ వాటి చిత్రాలను క్లిక్ మనిపించింది.మార్చి 2వతేదీన ఉదయం 7 గంటల ప్రాంతంలో జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అడవుల్లో ఈ దృశ్యాలు రికార్డ్ చేశాయి. టైగర్ రిజర్వ్‌లో నివసించే పులులను పర్యవేక్షించడానికి కెమెరా ట్రాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే, పులికి బదులుగా, ఎలుగుబంటి వీపుపై వాటి పిల్లలు కూర్చొనివెళుతున్న చిత్రం వెలుగుచూసింది.
పులి కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ట్రాకింగ్ బృందాలతో నిశితంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటికి వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Next Story

