తిరుపతి లడ్డూ వివాదం పుట్టిందెక్కడ, ముగిసిందెక్కడ?
x

తిరుపతి లడ్డూ వివాదం పుట్టిందెక్కడ, ముగిసిందెక్కడ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలనాత్మక ప్రకటన నుంచి సిట్ చార్జ్ షీటు ను కోర్టులో ఫైల్ చేసేదాకా ఎపుడెపుడు ఏమి జరిగింది?


తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీకి సంబంధించి సీబీఐ సిట్ (SIT) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. 2026 జనవరి చివరలో నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలైన ఈ 600 పేజీల నివేదిక ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, దీని విలువ సుమారు రూ. 250 కోట్లు అని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ కల్తీలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని, దానికి బదులుగా పామాయిల్, వెజిటబుల్ ఆయిల్స్, కెమికల్ ఎస్టర్స్‌తో కూడిన "సింథటిక్ నెయ్యి"ని వాడారని సిట్ స్పష్టం చేసింది.

అయితే, కల్తీ జరగడం అన్నది తిరుగులేని వాస్తవమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీటీడీ బోర్డు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, జంతు కొవ్వు ఆరోపణలు నిరూపణ కాలేదని పేర్కొంటూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ అంశంపై రాజకీయ పోరు మరింత ముదిరింది.

వివాదం ప్రారంభం

• 18 సెప్టెంబర్ 2024 — సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు (Animal Fat) వాడారని బహిరంగ ఆరోపణ చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

• 19 సెప్టెంబర్ 2024 — టీటీడీ, దేవాలయ పవిత్రతకు భంగం కలిగించే అంశమని పేర్కొంటూ స్పందించింది.

• 20 సెప్టెంబర్ 2024 — వైసీపీ ఈ ఆరోపణలను “రాజకీయ కుట్ర”గా అభివర్ణించి తీవ్రంగా ఖండించింది.

• 21–25 సెప్టెంబర్ 2024 — లడ్డూ నెయ్యి సరఫరాపై అనేక ప్రశ్నలు, టెండర్ ప్రక్రియపై అనుమానాలు వెల్లడి అయ్యాయి.

• సెప్టెంబర్ చివరి వారం 2024 — ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి.

సుప్రీంకోర్టు జోక్యం

• 1 అక్టోబర్ 2024 — కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT విచారణ తాత్కాలికంగా నిలిచిందని ఏపీ డీజీపీ తెలిపారు.

• 3 అక్టోబర్ 2024 — సుప్రీంకోర్టు విచారణలో “ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం” అని వ్యాఖ్యానించింది.

• 10 అక్టోబర్ 2024 — సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేకంగా CBI + AP Police + FSSAI అధికారులతో కూడిన SIT ఏర్పాటు అయింది.

• అక్టోబర్ 2024 — సుప్రీంకోర్టు పర్యవేక్షణలో SIT అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది.

దర్యాప్తు విస్తరణ

• నవంబర్ 2024 — SIT నెయ్యి కొనుగోలు టెండర్లు, సరఫరాదారుల అర్హత పత్రాలు పరిశీలించింది.

• డిసెంబర్ 2024 — నెయ్యి నమూనాలపై ల్యాబ్ పరీక్షల నివేదికలను SIT సేకరించింది.

• జనవరి 2025 — నెయ్యి సరఫరా చైన్‌లో అనుమానాస్పద కంపెనీలపై SIT దృష్టి పెట్టింది.

• ఫిబ్రవరి మొదటి వారం 2025 — విచారణలో ప్రధానంగా డెయిరీ కంపెనీల పాత్ర బయటపడింది.

SIT అరెస్టులు

• 9 ఫిబ్రవరి 2025 — SIT నలుగురిని అరెస్ట్ చేసింది:

o విపిన్ జైన్ — Bhole Baba Dairy

o పొమిల్ జైన్ — Bhole Baba Dairy

o అపూర్వ చావ్డా — Vaishnavi Dairy

o రాజు రాజశేఖరన్ — AR Dairy

• 10 ఫిబ్రవరి 2025 — తిరుపతి కోర్టు వీరిని న్యాయ కస్టడీకి పంపింది.

• ఫిబ్రవరి–మార్చి 2025 — SIT విచారణను ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.

• ఏప్రిల్–జూన్ 2025 — నకిలీ నెయ్యి సరఫరా విధానం, డాక్యుమెంట్ ఫోర్జరీ ఆరోపణలు బలపడ్డాయి.

కేసు కీలక మలుపులు

• జూలై 2025 — SIT నివేదికల్లో “సింథటిక్/నకిలీ నెయ్యి తయారీ” అంశం ప్రాధాన్యం పొందింది.

• సెప్టెంబర్ 2025 — సుప్రీంకోర్టు SIT దర్యాప్తు కొనసాగాలని స్పష్టం చేసింది.

• అక్టోబర్ 2025 — టీటీడీ లోపలి వ్యక్తుల పాత్రపై SIT దృష్టి పెట్టింది.

కీలక అరెస్ట్ – టీటీడీ వ్యవహారంలో

• 29 అక్టోబర్ 2025 — SIT అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు:

కే. చిన్న అప్పన్న

(మాజీ టీటీడీ చైర్మన్ సన్నిహితుడు/అనుచరుడు)

• 30 అక్టోబర్ 2025 — చిన్న అప్పన్నను అధికారికంగా రిమాండ్‌కు తరలించారు.

• 17–21 నవంబర్ 2025 — SIT కస్టడీతో చిన్న అప్పన్నపై విచారణ కొనసాగింది.

కెమికల్స్ సరఫరా కోణం

• 10 నవంబర్ 2025 — SIT అరెస్ట్ చేసిన ఢిల్లీకి చెందిన కెమికల్ ట్రేడర్:

అజయ్ కుమార్ సుగంధ్

(సింథటిక్ నెయ్యి తయారీలో ఉపయోగించే పదార్థాల సరఫరా ఆరోపణ)

టీటీడీ అధికారి అరెస్ట్

• 28 నవంబర్ 2025 — SIT అరెస్ట్ చేసిన టీటీడీ సీనియర్ అధికారి

ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం

• 9–12 డిసెంబర్ 2025 — అజయ్ కుమార్ సుగంధ్, సుబ్రహ్మణ్యం ఇద్దరిపై SIT కస్టడీ విచారణ జరిగింది.

ఛార్జిషీట్ దశ

• డిసెంబర్ చివరి వారం 2025 — SIT కేసులో నిందితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

• 23 జనవరి 2026 — SIT దర్యాప్తు ముగించి ఛార్జిషీట్ సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చాయి.

• 24 జనవరి 2026 — SIT నెల్లూరు ACB కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

• ఛార్జిషీట్‌లో మొత్తం 36 మంది నిందితులు ఉన్నారని మీడియా కథనం.

• SIT ఆరోపణ ప్రకారం ఇది రూ.250 కోట్ల మేర నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారంగా నమోదు అయింది. నెయ్యి కల్తీ వాస్తవం. అయితే, అందులో జంతువుల కొవ్వు లేదు. అయితే, పామాయిల్, పామ్ కెర్నెల్ అయిల్, పామ్ స్టియరిన్ అనేవి మాత్రం బాగా కల్తీ చేశారని చార్జ్ షీట్ సారాంశం.

Read More
Next Story