
తిరుపతి విశేషాలు: గోవిందరాజస్వామి తెప్పొత్సవం
మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామి
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
మధ్వ నవమిని పురస్కరించుకుని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో 140 మంది పండితులు శ్రీ మధ్వ విజయం పారాయణం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మధ్వాచార్యులు బోధించిన ద్వైత సిద్ధాంతం ద్వారా భక్తే మోక్షానికి మార్గమని చాటి చెప్పారన్నారు.
రథసప్తమి విజయవంతం
ఈ ఏడాది జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు.
రథ సప్తమి విశేషాలు
- గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షణ.
- అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం.
అన్నప్రసాదాలు
- రథ సప్తమి రోజున గ్యాలరీల్లోని భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు విరివిగా అన్న ప్రసాదాలు, పానీయాలు పంపిణీ.
- సొజ్జ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లను భక్తులకు పంపిణీ.
- 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ.
- వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగం.

