ఈవీఎం లపై బీజేపీ ట్యాగులు... TMC ధ్వజం
x

ఈవీఎం లపై "బీజేపీ ట్యాగులు"... TMC ధ్వజం

దేశంలో సార్వత్రిక ఎన్నికల ఐదవ విడత పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. పశ్చిమ బెంగాల్ లోని 8 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది.


దేశంలో సార్వత్రిక ఎన్నికల ఐదవ విడత పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. పశ్చిమ బెంగాల్ లోని 8 లోక్ సభ స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని అధికార త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అవకతవకలకు పాల్పడిందంటూ ఆరోపించింది. బంకురా జిల్లాలో BJP ట్యాగ్‌లు ఉన్న ఈవీఎం లు ఉపయోగించారని ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘానికి విషయం చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

"ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ పదేపదే చెబుతూనే వచ్చారు. ఈరోజు అదే నిజమైంది. బంకురా నియోజకవర్గంలోని రఘునాథ్‌పూర్‌లో బీజేపీ ట్యాగ్‌లతో కూడిన ఐదు ఈవీఎంలు దొరికాయి. ఎన్నికల సంఘం తక్షణమే సమస్యను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి" అంటూ ఆల్ ఇండియా టీఎంసీ ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

All India Trinamool Congressదీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి.. ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. “కమీషన్ చేస్తున్నప్పుడు, కామన్ అడ్రెస్ ట్యాగ్స్ పై అభ్యర్థులు, హాజరైన వారి ఏజెంట్లు సంతకం చేస్తారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి ప్రతినిధి మాత్రమే కమీషనింగ్ హాల్‌లో ఉన్నందున, ఆ EVM, VVPATలను కమీషన్ చేసే సమయంలో అతని సంతకం తీసుకోబడింది” అని అధికారి తెలిపారు.

“అలాగే, పోలింగ్ స్టేషన్స్ నెం. 56, 58, 60, 61, 62లో ఉన్న ఏజెంట్లందరి సంతకం పోలింగ్ సమయంలో తీసుకోవడం జరిగింది. కమీషన్ సమయంలో అన్ని నిబంధనలను సక్రమంగా పాటించారు, ఇది పూర్తిగా CCTV కవరేజ్‌ తో పాటు సరిగ్గా వీడియోగ్రాఫ్ చేయబడింది" అని పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది స్థానాలకు శనివారం ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. వీటిలో తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్ ఉన్నాయి.

Read More
Next Story