ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు..
x

ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు..

సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు చేయనుంది.


పశ్చిమ బెంగాల్‌ సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మపై ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. సందేశ్‌ఖాలీలో మహిళలపై హింస, అఘాయిత్యాల ఆరోపణలపై బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఛైర్‌పర్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసింది. రేఖా శర్మపై టీఎంసీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ అధికార ప్రతినిధి శశి పంజా తెలిపారు.

నాటకీయ పరిణామాలు..

సందేశ్‌ఖాలీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులపై చేసిన అత్యాచార ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. ఒక మహిళ, ఆమె అత్త ఉపాధి కూలీ రాకపోవడంతో మరో మహిళ కూలీ డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికి వారితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంది. టీఎంసీ నేతలు తమపై అత్యాచారానికి ఒడిగట్టారని ఫిర్యాదు చేస్తూ రాసిన ఆ కాగితాలు పోలీసులకు అందడంతో రాజకీయ దుమారం రేగింది. వాస్తవానికి తాము కేవలం సంతకం మాత్రం చేశామని అత్తాకోడళ్లు చెబుతున్నారు. " సంతకం చేయించుకున్న ఆమె బయటి వ్యక్తి. ఇక్కడ ఉన్న అందరి గురించి ఆమెకు ఎలా సమాచారం అందిందో మాకు తెలియదు. ఆమె బీజేపీలో ఉన్నట్లు మాకు తర్వాత తెలిసింది. మాకు అబద్ధాలు చెప్పి మాతో సంతకం చేయించుకున్న ఆమెకు శిక్ష పడాలి’’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాల కోసం బిజెపి మహిళలను వాడుకుంటోందని తృణమూల్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. అత్యాచారం ఆరోపణలను ఉపసంహరించుకున్న మహిళలను స్థానిక బీజేపీ నేతలు బెదిరించడం సిగ్గుచేటని బెంగాల్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శశి పంజా పేర్కొన్నారు.

Read More
Next Story