రేపే అండర్ 19 క్రికెట్ ఫైనల్.. ఆరో టైటిల్ పై యువ భారత్ గురి
x

రేపే అండర్ 19 క్రికెట్ ఫైనల్.. ఆరో టైటిల్ పై యువ భారత్ గురి

అండర్ 19 ఫైనల్ లో యువ భారత్ మరో టైటిల్ గెలుచుకుంటుందా? గత ఏడాది భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై వరల్డ్ ఫైనల్ లో ఓడిపోయి అభిమానుల చేత కన్నీళ్లు పెట్టించింది.


అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రేపే. యువ భారత్, యువ ఆస్ట్రేలియా జట్ల మధ్య బెనినో వేదికగా ఈ మ్యాచ్ జరగుతుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో ఇరు జట్లు ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి కాబట్టి రేపటి పోరు హోరాహోరీగా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటి వరకూ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ ఉదయ్ సహరన్ నిలిచాడు. 389 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. కీలక సమయాల్లో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చడంలో అతడిదే కీలకపాత్ర. మరోసారి ఫైనల్ లో తన బ్యాటింగ్ మ్యాజిక్ చేయాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. అలాగే సెమీస్ లో విఫలం అయిన టాప్ ఆర్డర్ గాడిన పడాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.

మొన్న భారత్ వేదిక జరిగిన 2023 ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై అభిమానుల చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే ఈ మ్యాచ్ ను మేము ప్రతీకారంగా చూడట్లేదని కెప్టెన్ ఉదయ్ సహరన్ మీడియా తో చెప్పారు. ఈ టోర్నిలో ఆసీస్ తరఫున కెప్టెన్ హ్యూ బీబ్ జెన్, ఓపెనర్ హ్యరీ డిక్సన్, సీమర్లు టామ్ స్ట్రాకర్, కల్లమ్ ఉత్తమ ప్రదర్శన చేస్తున్నారని, వారిని ఎదుర్కోవడంపైనే విజయం ఆధారపడి ఉందని ఉదయ్ సహరన్ అన్నారు.

ఐదు సార్లు ఛాంపియన్

ఇప్పటి భారత్ తొమ్మిది సార్లు అండర్ 19 ఫైనల్ కు వెళ్లగా అందులో 5 సార్లు విజయం సాధించింది. 2016 నుంచి జరిగిన అన్ని ఫైనల్ మ్యాచ్ ల్లో భారత్ ఆడింది. అయితే అందులో 2016, 2020 ఎడిషన్ లో ఓటమి పాలవ్వగా 2018, 2022 ఫైనల్ మ్యాచ్ ల్లో గెలిచి విజేతలుగా నిలిచారు. ఆస్ట్రేలియా తో మొత్తం 2012, 2018లో భారత్ తలపడగా రెండు సార్లు భారత్ నే విజయం వరించింది.

2008 లో విరాట్ కోహ్లి సారథ్యంలోని అండర్ 19 జట్టు ట్రోఫిని గెలుచుకున్నప్పటి నుంచి అండర్ 19 ప్రపంచకప్ చాలా ప్రాచుర్యం పొందింది. తరువాత లైవ్ స్ట్రీమ్ కవరేజ్ కారణంగా క్యూరియాసిటీ పెరిగింది. అండర్ 19 ప్రపంచకప్ లోనే ఉత్తమ ప్రదర్శన చేసి యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజా, రాహూల్, రిషభ్ పంత్, గిల్, యశస్వీ జైశ్వాల్ వంటి స్టార్లు భారత జట్టులోకి ప్రవేశించారు.

అలాగే తక్షణ స్టార్ డమ్ ను అందుకోలేక విఫలం అయిన వారి జాబితా చాలా పెద్దదని కూడా తెలుస్తోంది. 2000 ప్రారంభంలో రితిందర్ సింగ్ సోధిస్, గౌరవ్ ధిమాన్, ఉన్ముక్త్ చంద్, హర్మీత్ సింగ్, విజయ్ జోల్, సందీప్ శర్మ, అజితేష్ అర్గల్, కమల్ పాసీ, సిద్దార్థ్ కౌల్, స్మిత్ పటేల్, రవికాంత్ సింగ్, కమలేష్ నాగర్ కోటి , పృథ్వీ షా వంటి వారు కూడా ఉన్నారు. జూనియర్ క్రికెట్ లో చాలా బాగా ఆడిన వారు తరువాత సీనియర్ క్రికెట్ లో ఈ జోరును కొనసాగించడంలో విఫలం అవతున్నారు. సీనియర్ క్రికెట్ లో ఆ ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయని యష్ ధుల్ వంటి వారు చెబుతున్న మాట.

ప్రస్తుత భారత యువజట్టు ఆసియా కప్ ఫైనల్ లో చోటు దక్కించుకోలేకపోయింది. దాంతో ఉదయ్ సహరన్ నేతృత్వంలోని ఈ జట్టుపై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచ కప్ లో తమ పని తాము కూల్ గా చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్ వరకూ వచ్చారు.

ప్రస్తుతం జట్టు మొత్తం సమష్టిగా రాణిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలం అయితే మిడిల్ ఆర్డర్ రాణిస్తోంది. ముఖ్యంగా సచిన్ దాస్ ఫినిషర్ పాత్ర చక్కగా పోషిస్తున్నాడు. అలాగే పేసర్ రాజ్ లింబా, స్పిన్నర్ సౌమీ పాండే, మరో పేసర్ నమన్ తివారీ మంచి బౌలింగ్ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. సర్పరాజ్ తమ్ముడు ముషిర్ కూడా బ్యాటింగ్, లెప్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.

భారత టీమ్: ఉదయ్ సహరన్(కెప్టెన్) అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఆరవెల్లి అవనీష్ రావు(కీపర్), సౌమ్య్ కుమార్ పాండే( వైస్ కెప్టెన్), మరుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ

ఆస్ట్రేలియా: హ్యూ వీబ్ జెన్(కెప్టెన్) , లాచ్ లాన్ ఐట్ కెన్, చార్లీ అండర్సన్, హర్కీరత్ బజ్వా, బార్డ్ మ్యాన్, కాంప్ బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్(కీపర్), సామ్ కాన్ట్సాస్, రాఫెల్ మాక్ మిలన్, ఐడాన్ ఓకానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లేర్ ఓల్లీ పీక్


Read More
Next Story