
తిరుమలలో పాదరక్షలు గుర్తించేందుకు క్యూఆర్ కోడ్
ఇక భక్తులు తమ పాదరక్షలు గుర్తించేందుకు తల బాదుకోవనసరం లేదు
తిరుమల ఆలయ్యాన్ని సందర్శించే భక్తులు ఇక తమ పాదరక్షలను గుర్తించేందుకు ఇక ముందు శ్రమించాల్సిన అసవరం లేదు. విశాలమయిన తిరుమల ఆలయ ప్రాంగణంలో పాదరక్షణలు వదలివేసిన చోటును గుర్తించడంలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. దీనిని నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయబోతున్నది. క్యూాఆర్ విధానాన్ని ఆరునెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించిన అనంతరం టిటిడి నిర్ణయం తీసుకుంది. తొందరల్లోనే టిటిడి నిర్వహించే అన్ని పర్వాల్లో ఈ స్మార్ట్ పుట్ వేర్ ట్రాకింగ్ సిస్టమ్ అమలులోకి వస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా అమలుచేసిన QR కోడ్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్, నిర్వహణ వ్యవస్థ (QR code-based footwear tracking and management system) విజయవంతమయిందని టిటిడి ప్రకటించింది. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ లో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినపుడు క్యూఆర్ కోడ్ స్మార్ట్ ఫుట్ వేర్ ట్రాకింక్ వ్యవస్థను ప్రయోగించి మంచిఫలితాలు సాధించారు.
సెప్టెంబర్ 2025 మరియు ఫిబ్రవరి 15, 2026 మధ్య ఈ ప్రయోగం జరిగింది. దీనికోసం ఏర్పాటు చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ 8,45,816 పాదరక్షల డిపాజిట్ డెలివరీ సులభంగా భక్తులకు అందించింది. ఈ కాలంలో భక్తులు అందించిన 4,24,047 జతల పాదరక్షలలో , 4,21,769 జతలను భక్తులకు సురక్షితంగా తిరిగి ఇచ్చారు. ఇది అధిక రికవరీ రేటు. ఇది ప్రయోగం విజయవంతమయ్యింది అనేందుకు సాక్ష్యం. ఇక ముందు భక్తులు టిటిడి కౌంటర్లలో పాదరక్షలు ఎక్కడ జమ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు. వాటిని భద్ర పరచడమే కాదు, శుభ్రంగా ఉంచేందుకు ఈ వ్యవస్థ తోడ్పడుతుందిని వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలకు ప్రతియేడాది 2.5 కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో పాదరక్షలు నిషేధం. అందువల్ల వీరంతా ఆలయం వెలుపల అనేక చోట్ పాదరక్షలను వదిలేస్తుంటారు. దీనికి తోడు ఆలయ ప్రవేశద్వారం, నిష్క్రమణ ద్వారం చాలా దూరంగా ఉంటాయి. దీనితో ఆలయం వెలుపల పాదరక్షలను ఎక్కడ వదిలేస్తారా చాలా సార్లు భక్తులు మర్చిపోతుంటారు. వాటిని గుర్తించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. దీనిని మీద భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో టిటిడి ఒక పరిష్కార మార్గం ఆలోచించింది. అదనపు ఇవొ వెంకయ్య చౌదరి చొరవ తీసుకుని టెక్నాలజీ ని ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించాలని భావించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సహకారం తీసుకుని క్యూఆర్ కోడ్ వ్యవస్థను రూపొందించారు. ఈ స్మార్ట్ ఫుట్ వేర్ ట్రాకింగ్ సిస్టమ్ ను పైలట్ ప్రాజక్టుకు గా అమలుచేశారు.ఇది సక్సెస్ అయింది. దీనితో టిటిడి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు ఈ స్మార్ట ఫుడ్ వేర్ ట్రాకింగ్ సిస్టమ్ ను విస్తరింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

