
ప్రవీణ్ చక్రవర్తి
‘‘టీవీకే కచ్చితంగా పెద్ద శక్తి, పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’
కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి
కాంగ్రెస్ - టీవీకే మధ్య పొత్తుపై ప్రయత్నాలు జరిగాయనే మీడియా ఊహగానాలను కాంగ్రెస్ నాయకుడు తోసిపుచ్చారు. తమిళనాడులో పొత్తులపై ఎలాంటి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పారు. అయితే చర్చలు ముగిశాయనే వాదలను సైతం ఆయన ఖండించారు. తమిళనాడులో విజయ్ స్థాపించిన టీవీకే కచ్చితంగా ఓ శక్తి అని అంగీకరించారు.
అధికారిక ప్రకటన లేదు
డీఎంకే- కాంగ్రెస్ కూటమి బంధంపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాలేదని చక్రవర్తి అన్నారు. ‘‘నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఎటువంటి పొత్తు గురించి ప్రకటన రాలేదు. నిన్న కూడా తమిళనాడు ఇన్ చార్జ్ గిరిష్ చోడంకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ డిమాండ్లపై డీఎంకే నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము’’ అని ఆయన అన్నారు. ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేశాయని ఆయన చెప్పారు.
వ్యక్తిగతంగా పొత్తులు..
తాను వ్యక్తిగతంగా పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా అనే వార్తలను తోసిపుచ్చారు. తమిళనాడులోని పార్టీ క్యాడర్ మనోభావాలను తాను వ్యక్తపరిచానని మాత్రమే అన్నారు.
‘‘60 సంవత్సరాలు అధికారం నుంచి బయటపడిన తరువాత కాంగ్రెస్ కేడర్ లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది పార్టీ తనన తాను బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అన్నారు. ఈ డిమాండ్ల వెనక రాష్ట్రంలో రాహుల్ గాంధీకి లభిస్తున్న ప్రజాదరణ కారణమని ఆయన అన్నారు.
టీవీకే మూడో శక్తి..
కాంగ్రెస్ పార్టీ టీవీకేను బేరసారాలను ఉపయోగించుకుంటుందనే ఆరోపణలపై వ్యాఖ్యానించడానికి చక్రవర్తి నిరాకరించారు. అయితే టీవీకే ఎన్నికల అవకాశాల గురించి ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. విజయ్ కచ్చితంగా మూడో శక్తి అని ఆయన అంగీకరించారు.
‘‘తొలిసారి రాజకీయ పార్టీ పెట్టేవారి టీవీకే ఓటు వేస్తామని చెప్పేవారి శాతం గణనీయంగా ఎక్కువగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. సీట్ల మార్పిడిపై అంచనాల గురించి చక్రవర్తి హెచ్చరించారు.
‘‘ఓట్లు సీట్లుగా మారుతాయో లేదో ఎవరికి తెలియదు. వేరేలా చెప్పుకునే వారితో మాట్లాడాలి’’ అని ఆయన అన్నారు. 2026 ఎన్నికలు తమిళనాడులో విలక్షంగా ఉంటాయని, అయితే కాంగ్రెస్ అవకాశాలపై వ్యాఖ్యలపై ఆయన నిరాకరించారు.
Next Story

