క్రికెట్ బాల్  పక్కజట్టు ఫీల్డర్ తలకు తగిలి...
x

క్రికెట్ బాల్ పక్కజట్టు ఫీల్డర్ తలకు తగిలి...

దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. చూడటం, ఆడటంలో భారత్ తరువాతే మరో దేశం ఉంటుందనడంలో సందేహం లేదు.


మెట్రో నగరాల్లో ఉన్న జనాభాకు సరిపడా గ్రౌండ్ లు ఉండవు. అందుకే ఓకే గ్రౌండ్ లో అనేక మ్యాచ్ లు జరుగుతుంటాయి. అలాంటి ఓ మ్యాచ్ జరుగుతుండగా పక్క టీం బ్యాట్స్ మన్ బాదిన బంతి, అవతలి టీంలో పీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి తగిలి మరణించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

ముంబైలోని మాతుంగా ప్రాంతంలోని దడ్కర్ క్రికెట్ మైదానంలో జయేష్ చున్నిలాల్ సావ్లా అనే వ్యక్తి తలకు బంతి బలంగా తగలడంతో అపస్మారక స్థితిలో వెళ్లాడని పోలీసులు తెలిపారు. మైదానంలో ఒకే సారి రెండు జట్లు క్రికెట్ ఆడుతున్నాయి. తన జట్టుకు ఆడుతున్న సమయంలో మరో పిచ్ ముందు జయేష్ ఫీల్డింగ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో అవతలి జట్టు బ్యాట్సమన్ కొట్టిన బంతి బలంగా వెనకవైపు తలకు తగిలింది అని పోలీస్ అధికారి తెలిపారు. బాల్ బలంగా తగలడంతో అతను వెంటనే నేలపై కూలబడిపోయాడని, స్నేహితులు వెళ్లి చూసే సరికి స్పృహలో లేడని ఆయన వెల్లడించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారని చెప్పారు. దీంతో అతని స్నేహితులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. అప్పటిదాకా తమతో ఆడిన స్నేహితుడు మరణించాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

తల గాయం కారణంగానే సావ్లా మరణించాడని, మాతుంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కుచ్చి సంఘం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈ మైదానంలో మ్యాచ్ లు జరుగుతున్నాయి.

Read More
Next Story