
Big Breaking: తెలంగాణలో ఏడుగురికి ‘పద్మశ్రీ’ పురస్కారాలు
కళా, సైన్స్ తదిాతర రంగాల్లో సేవలందించిన వారికి పద్మ పురస్కారాలు దక్కాయి
కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీలు లభించాయి. డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, మామిడి రామారెడ్డికి పద్మ పురస్కారాలు వరించాయి. 2026 ఏడాదికి కేంద్రప్రభుత్వం పద్మపురస్కారాలను కాసేపటిక్రితమే ప్రకటించింది. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై తంగరాజ్ అనేక పరిశోధనలు చేశారు. మూడు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న తంగరాజ్ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న శాస్త్రవేత్త. అలాగే పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషికి మామిడి రామారెడ్డికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరితో పాటు మరో ఐదుగురు విజయ్ ఆనందరెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి(సైన్స్, టెక్నాలజీ) దీపికారెడ్డి,( కళావిభాగం), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, గూడూరు వెకంట్ రావుకు కూడా పద్మశ్రీ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

