
అమెరికాలో కారు ప్రమాదం.. తెలంగాణ యువతులు మృతి
ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లారు.
అమెరికా కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. యువతుల మరణ వార్తను కాలిఫోర్నియా అధికారులు ధృవీకరించారు. వారిద్దరూ తెలంగాణ మహబూబాబాద్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మేఘన(24), కడియాల భావన(24) ఇద్దరూ కూడా ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లారు. వారు వీకెండ్ సందర్భంగా బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల..మీసేవ సెంటర్ నిర్వహకుడు కాగా, భావన తడ్రి కోటేశ్వరరావు.. ముల్కనూర్ ఉపసర్పంచ్ అని సమాచారం.
Next Story

