టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
x

టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

పలువురు కార్మికులు భయంతో కిందకు దూకేయడంతో వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.


హైదరాబాద్ టౌలీచౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడిక్కడే మరణించారు. ఐదో అంతస్తుల పనిచేస్తున్న పలువురు కార్మికులు భయంతో కిందకు దూకేయడంతో వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుంది.

సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగానే మృతదేహాలను వెలికితీసే పనులను శరవేగంగా కొనసాగిస్తోంది. ప్రమాద సమయంలో సుపారు 10 మంది భవనంలో పనిచేస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అదిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులుత తెలిపారు.

భవన నిర్మాణానికి తగిన అనుమతులు ఉన్నాయా? లేదా? నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను పాటిస్తున్నారా? లేదా? అసలు భవనం ఎందుకు కూలింది? వినియోగించిన మెటీరియల్ నాణ్యత ఎంతమేరా ఉంది? వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More
Next Story