ఉత్తరాఖండ్ తరహాలో యూనిఫాం సివిల్ కోడ్‌: హోం మంత్రి షా
x

ఉత్తరాఖండ్ తరహాలో యూనిఫాం సివిల్ కోడ్‌: హోం మంత్రి షా

ఉత్తరాఖండ్ తరహాలో దేశంలోనూ యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘గ్యారంటీ’ ఇచ్చారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.


ఉత్తరాఖండ్ తరహాలో దేశంలోనూ యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘గ్యారంటీ’ ఇచ్చారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. పౌరీ గర్వాల్ లోక్‌సభ స్థానానికి బిజెపి అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడుతూ.. ఎన్నికల ర్యాలీనుద్దేశించి షా మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి రాష్ట్రంలో యూసీసీని ప్రవేశపెట్టారని, అదే తరహాలో దేశవ్యాప్తంగా యూసీసీని ప్రవేశపెడతామని మోదీ మా ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో)లో హామీ ఇచ్చారు’’ అని కేంద్రం హోం మంత్రి పేర్కొన్నారు.

కాశ్మీర్‌తో ఉత్తరాఖండ్, రాజస్థాన్ ప్రజలకు ఏం సంబంధమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నకు షా వివరణ ఇచ్చారు.

కశ్మీర్‌ను రక్షించడానికి గర్వాల్ సైనికులు రక్తాన్ని చిందించారని ఖర్గేకు తెలియదన్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఎవరైనా పాకిస్థాన్ నుంచి వచ్చి పేలుళ్లు జరిపి తిరిగి వెళ్లేవారని, అయితే నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఉరీ, పుల్వామాలో ఉగ్రవాదులను సర్జికల్, వైమానిక దాడులతో తుదముట్టించిందని గుర్తు చేశారు.

మాజీ సిడిఎస్ బిపిన్ రావత్‌పై కాంగ్రెస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందని షా ఆరోపించారు, ప్రతిపక్ష పార్టీ వీర యోధుడిని అవమానించడానికి అనుమతించడం బాధాకరమన్నారు.

మోదీ మూడోసారి ప్రధానిగా ఉంటే దేశంలో రిజర్వేషన్ వ్యవస్థను తొలగిస్తారన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలకు షా కౌంటర్ ఇచ్చారు. "మోదీ మూడోసారి ప్రధాని అయితే రిజర్వేషన్ పోతుందని ఖర్గే చెప్పారు. మోడీ జీ రిజర్వేషన్లకు మద్దతిచ్చేవారు. మేం రిజర్వేషన్లను ఉపసంహరించం. ఎవరిని అలా చేయనివ్వం" అని పేర్కొన్నారు.

Read More
Next Story