Union Budget: 2047 కల్లా ‘వికసిత్‌ భారత్‌’ సాకారం
x

Union Budget: 2047 కల్లా ‘వికసిత్‌ భారత్‌’ సాకారం

పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.


Click the Play button to hear this message in audio format

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే ఏడాదిలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పన ఉంటుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2024-25 ఆర్థిక సర్వే(Economic Survey 2024-25)ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ రూపొందించిన ఈ సర్వే ప్రకారం.. కూరగాయల ధరలు పెరగడం, ఖరీఫ్ పంటల రాక కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని సర్వే అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ – డిసెంబర్ మధ్య వినియోగదారుల ఆహార ధరల సూచిక 8.4 శాతానికి చేరుకుంది. ఇది 2024లో 7.5 శాతంగా ఉంది. కూరగాయలు, పప్పుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే సర్వేను ప్రకారం రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

ఆర్థిక సర్వే ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్య ఉంటుందని అంచనా. ఆర్థిక సర్వే ప్రకారం..2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలంటే, రాబోయే ఒకటి నుండి రెండు దశాబ్దాల వరకు 8 శాతం చొప్పున ఆర్థిక వృద్ధి జరగాలి. 2024-25లో కార్మిక సంస్కరణల కారణంగా..కార్మికుల హక్కులు రక్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే 2030కల్లా ఏటా 78.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. అప్పుడే 2047కల్లా వికసిత్‌ భారత్‌ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివే..

2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ.. దేశ జీడీపీ 6.3-6.8శాతంగా ఉండొచ్చు. వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉంటాయని అంచనా. తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్‌ పెట్టుబడులు తగ్గడంతో 2024-25లో భారత వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం. 2023-24లో వృద్ధి రేటు 8.2శాతంగా ఉండగా.. 2022-23లో 7.2శాతం, 2021-22లో 8.7శాతంగా ఉంది. ఖరీఫ్ పంట రాకతో ఆర్థిక సంవత్సరం 2025లో నాలుగో త్రైమాసికంలో కూరగాయల ధరల సడలింపు కారణంగా ఆహార ద్రవ్యోల్భణం తగ్గే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు బాగుంటే, రబీ పంట దిగుబడి కారణంగా 2026 తొలి అర్థభాగంలో ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ఉంది.

తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో 2024-25 వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కావొచ్చు. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం 2023-24లో 8.2 శాతంగా వృద్ధిరేటు ఉంటే, 2022-23లో 7.2 శాతం, 2021-22లో 8.7 శాతంగా ఉంది.

Read More
Next Story