అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం
x

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం

అమెరికా ప్రతిపాదనలను అంగీకరించని ఇరాన్


పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన కీలక యుద్ధవిరామ చర్చలు విఫలమయ్యయి. ప్రపంచమంతా ఉత్కంఠ తో ఎదురు చూస్తున్న ఈ చర్చల్లో అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందానికి రాలేకపోయాయి. ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత వాషింగ్టన్ ప్రతిపాదించిన షరతులను అంగీకరించడానికి టెహ్రాన్ నిరాకరించిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు నుంచి బయటకు వస్తూ ప్రకటించారు. చర్చలు విఫలమయ్యాక ఒక పత్రికా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడుతూ అమెరికా షరతులను అంగీకరించకూడదని ఇరాన్ నిర్ణయించుకుందని వాన్స్ వెల్లడించారు. అయితే, అమెరికా మొండిపట్టుదలే చర్చలు విఫలమయ్యేందుకు కారణమని ఇరాన్ స్టేట్ మీడియా ‘ప్రెస్ టివి’ వెల్లడించింది.

ఒక మంచి ప్రతిపాదనను, చివరి ప్రతిపాదనను అమెరికా ఇరాన్ ముందుంచిందని అయినా ఇరాన్ అంగీకరించలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

"బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, మేము ఒక ఒప్పందానికి రాలేకపోయాము. ఇది అమెరికాకంటే కంటే ఇరాన్‌కే చాలా ఎక్కువ చెడు వార్త అని నేను భావిస్తున్నాను," అని చర్చల అనంతరం ఆయన వ్యాఖ్యానించారు.

1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత వాషింగ్టన్ మరియు టెహ్రాన్‌ల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం జరగడం ఇదే. హర్మూజ్‌ జలసంధి తెరవాలని అమెరికా డిమాండ్‌ చేసింది. అయితే, తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. దీనితో చర్చల్లో పురోగతి కనిపించలేదు అని జేడీవాన్స్‌ అన్నారు.

ఇరాన్ ఏఏ ప్రతిపాదనలను తిరస్కరించిందని విలేకరులు అడగ్గా, వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అఅణ్వాయుధాలను తయారుచేయకూడదనేదాని ఒక కట్టుబాటును ఇరాన్ ప్రకటించాలని అమెరికా పట్టుబట్టినట్లు వాన్స్ చెప్పారు.

“అమెరికా మితిమీరిన డిమాండ్ల ప్రతిపాదించిందని దీనితో విఫలమయ్యాయని ఇరాన్ చెబుతున్నది. హోర్ముజ్ జలసంధి తెరవడం, ఇరాన్ అణు హక్కులు కాపాడుకోవడం వంటి అంశాలతో మరికొన్ని ఇతర కీలకమ అంశాలలో ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా మరీ ఎక్కువగా ఒత్తిడి తేవడంతో ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు,” ప్రెస్ టీవీ పేర్కొంది. చర్చలు రెండో రోజుకు సాగడంతో, వాషింగ్టన్ "మితిమీరిన, చట్టవిరుద్ధమైన డిమాండ్లు" చేసింద ఇరాన్ అధికారులు ఆరోపించారు.

మరొక వైపు చర్చల మీద వ్యాఖ్యానిస్తూ మరొక దఫా చర్చలు జరిపే ప్రతిపాదన ఇప్పట్లో లేదని ఇరాన్ ప్రభుత్వం సమాచార సంస్థలు ప్రకటించారు. అయితే, ఆ దేశ విదేశాంగ శాఖ ఇలాంటి వైఖరి తీసుకోలేదు. ‘దౌత్యానికి ముగింపు అనేది ఉండు,’ అని మాత్రం వ్యాఖ్యానించింది.

చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండా ముగియడం మీద పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య దౌత్యం నెరపేందుకు పాకిస్తన్ ఎపుడూ సిద్ధంగా ఉంటుందని ఆదేశ విదేశాంగమంత్రి ఇషాక్ దర్ ప్రకటించారు.



Live Updates

  • 12 April 2026 1:13 PM IST

    ఇరాన్ పై పోరాటం ముగియలేదు: నెతాన్యాహూ

    ఇరాన్ తో జరిగిన పోరాటంలో చారిత్రక విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ‘‘ఈ పోరాటం ఇంకా ముగియలేదు. కానీ ఇరాన్ అణు ఆశయాలను ఇజ్రాయెల్ అడ్డుకుంది’’ అని అన్నారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఆయన హిబ్రూ భాషలో విడుదల చేసిన వీడియోలో అన్నారు.

    ఇరాన్ అణ్వాయుధాలను, రోజుకు వందలాది క్షిపణులు తయారు చేసే సామర్థ్యానికి చాలా దగ్గరగా వచ్చినందు వలన తాము పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. భూగర్భంలో బీ-2 బాంబర్లు సైతం చేరుకోలేని విధంగా అణ్వాయుధ కార్యక్రమాలు నిర్వహించతలపెట్టడంతో తాము చూస్తూ ఊరుకోలేకపోయామని ఆయన అన్నారు. 

  • 12 April 2026 1:07 PM IST

    ‘‘గడచిన 24 గంటల్లో హార్మూజ్ జలసంధి, అణు సమస్య, యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ పై ఈ ప్రాంతంలో యుద్ధానికి పూర్తి ముగింపు పలకడం వంటి ప్రధాన చర్చలపై సంప్రదింపులు జరిగాయి’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ చర్చల ప్రక్రియకు ముందుకు వచ్చినందుకు పాకిస్తాన్ కు అభినందనలు తెలియజేశారు. కానీ శాంతి చర్చలు విఫలం అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు పక్షాలు తమ డిమాండ్లపై మెట్టు దిగడానికి అంగీకరించకపోవడంతో ఇవి విఫలం అయినట్లు తెలిసింది.

Read More
Next Story