
ఇండియా మరొక ‘బాంబ్’ వేయాలనుకుంటున్న ట్రంప్
భారత దిగుమతుల మీద 500 శాతం టారిఫ్ ప్రతిపాదన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత మీద ఆగ్రహం తగ్గ లేదు. అదింకా బాగా ముదురుతూ ఉంది. రష్యా మీద కోపాన్నంతా ఆయన భారత్ మీదకు మళ్లిస్తున్నాడు. భారతీయ దిగుమతుల మీద టారిఫ్ ను 5౦ శాతం పెంచినా ఇండియా తొణక బెణక లేదు. ఇది ట్రంపుకు నచ్చలేదు. అందుకే ఈ సారి ప్రపంచంలో ఎపుడూ ఎక్కడ లేనంతగా ఎవరూ వూహించనంతగా సుంకాలను పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. రష్యాతో ఆయిల్ కొంటున్న ప్రధాన దేశాలమయిన ఇండియా, చైనాల మీద సుంకం 500 శాతం పెంచేందుకు రంగం సిద్ధమయింది.
ఇలా మితిమీరిన టారిఫ్ లు పెంచేందుకు దేశాధ్యక్షుడికి అధికారం కట్ట బెట్టే బిల్లు ఒకటి అమెరికా పార్లమెంటు ముందుకువస్తున్నది.
ఆమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్, కాంగ్రెస్ సభ్యుడు బ్రియాన్ ఫిట్జ్ పాట్రిక్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. యుక్రెయిన్ తో రష్యా చేస్తున్నయుద్ధానికి మద్దతు తెలిపే దేశాలన్నింటికి ఈ బిల్లు వర్తిస్తుంది.
చాలా రోజులుగా తాము ఈ బిల్లును రూపొందించడంలో ఉన్నామని గ్రాహం, ఫిట్జ్ పాట్రిక్ చెప్పారు. యుక్రెయిన్ తో యుద్ధవిరమణ ఒప్పందం చేసుకునేందుకు రష్యా విముఖంగా ఉన్నందున, ఆ దేశం మీద శిక్షాసుంకం విధించేందుకు ప్రధానంగా ఈ బిల్లును రూపొందిస్తున్నారు. ఇందులో రష్యాతో ఆయిల్ వ్యాపారం చేస్తున్న దేశాలమీద 500 శాతం పన్ను పెంచాలన్న ది మరొక ముఖ్యమమయిన అంశంగా ఉంటుంది. దీని వల్ల భారత్, చైనా, బ్రెజిల్ దేశాల మీద 500 శాతం సుంకం పడుతుంది.