వెలుగుమట్ల భూదాన కాలనీ నాయకుడు ముత్తయ్య కిడ్నాప్
x
కిడ్నాప్ అయిన భూదాన్ కాలనీ వాసులు పోరాట నాయకుడు ముత్తయ్య

వెలుగుమట్ల భూదాన కాలనీ నాయకుడు ముత్తయ్య కిడ్నాప్

వెంటనే విడుదల చేయాలని ఒపిడిఆర్ డిమాండ్


ఖమ్మం జిల్లా అడవి మద్దులపల్లి గ్రామానికి చెందిన భూదాన్ కాలనీ వాసుల పోరాట నాయకుడు పోలబోయన ముత్తయ్య వయసు 52 (ఒక కోయ) న్యూ మారుతినగర్, రోడ్ 12, మెయిన్ రోడ్డు సమీపంలో సాయంత్రం 5:30 గంటల నుంచి కనిపించకపోవడం పట్ల ఆందోళనే చెందుతున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థ (ఒపిడిర్ ) డిమాండ్ చేసింది.

ద్విచక్ర వాహనం మీద వెళుతున్న ముత్తయ్యని బఎవరో తెల్ల క్రెటా కారులోకి బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు బాటసారులు చెప్పారు. కారులో ఉన్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తీసుకొని టైలర్ షాప్ సమీపంలో విసిరివేసి కారులో పారిపోయాడు. కారు చాలా వేగంతో నడుపబడిందని స్థానికులు చెబుతున్నారు.

ఖమ్మం పట్టణంలో వెలుగుమట్ల గృహ స్థలాల పోరాటానికి ముత్తయ్య ప్రధాన నాయకుడు. ఈ మధ్య కాలనీ వాసులు గృహాలను ప్రభుత్వం ధ్వంసం చేయడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడ ఈ నెల 24న సుమారు 1000 ఇళ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. అన్ని పక్షాలనుంచి మద్దతు లభించడంతో ఆందోళన తీవ్రతరమయింది. ఈ నేపథ్యంలో ఉద్యమనాయకుడయిన ముత్తయ్య కిడ్నాప్ జరిగింది.

అందువల్ల ఇది పోలీసుల చేతి పని. సమీపంలోని దుకాణం నుండి సిసి ఫుటేజ్ సాయంత్రం 5.38 గంటలకు అతన్ని కిడ్నాప్ చేసినట్లు చూపిస్తుంది. అతనిని తీసుకు వెళ్ళిన కారుకు నంబర్ ప్లేటు కూడా లేదు. ఈ సంఘటనను అందరూ ఖండించి , అతని విడుదలకు సహకరించవలసిందిగా ఒపిడిర్ ప్రధాన కార్యదర్శి డి విజయేందర్ రావు, ఉపాధ్యక్షుడు డా ఎస్ జతిన్ కుమార్ కోరారు.

Read More
Next Story