‘ఇండియా’కి వచ్చి మేము మెరుగయ్యాం: మెక్ కల్లమ్
x

‘ఇండియా’కి వచ్చి మేము మెరుగయ్యాం: మెక్ కల్లమ్

భారత్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మా జట్టు ఇంతకుముందు కంటే మెరుగైందని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ అభిప్రాయపడ్డాడు.


భారత్ వేదికగా జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ విధానం పై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ కోచ్, బ్రెండన్ మెక్ కల్లమ్ స్పందించాడు. ధర్మశాలలో జరిగే ఐదో టెస్ట్ లోనూ తాము బజ్ బాల్ విధానాన్ని అనుసరిస్తామని వెల్లడించారు. బజ్ బాల్ విధానంలో ఇండియాకి వచ్చాక మెరుగైయ్యామని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

ఇప్పటికే 3-1 తో సిరీస్ ను కోల్పోయినప్పటికీ ఎన్నో విషాయాలను నేర్చుకున్నామని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. " ఈ సిరీస్ లో మాకంటే వారు (భారత్) బాగా ఆడారు. మేము అనుకున్న దానికంటే బాగా ఆడారు. యాషెష్ లో మేము ఇలాగే ఆడి అవకాశాలు సృష్టించుకున్నాం. కానీ ఇక్కడ ఆ రేఖను దాటలేకపోయాం.
ప్రస్తుత జట్టు బజ్ బాల్ గేమ్ లో ఒక సమష్టితత్వంతో టీమ్ గా ఎదుగుతోంది" అని వివరించారు. ఇక్కడ మాకు తగినన్ని అవకాశాలు కల్పించుకున్న కూడా సరైన సమయంలో వాటిని ఉపయోగించుకోలేకపోయామని అభిప్రాయపడ్డారు. ఇండియాలో మంచి క్రికెట్ ఆడామని అనేక విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. అయితే ఇంగ్లండ్ టీమ్ అనుకున్నంత మేర ఆడలేకపోయిందనేది మాత్రం నిజమని బ్రెండన్ మెక్ కల్లామ్ పేర్కొన్నారు.
కోచ్ గా ఎంజాయ్ చేస్తున్నా
తాను కోచ్ గా ఎంజాయ్ చేస్తున్నా అని ఈ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ చెప్పారు. ఈ లైఫ్ బాగానే ఉందన్నారు. తన టీమ్ గురించి మరికొన్ని విషయాలను మీడియా ముఖంగా వివరించారు. " కొన్ని సార్లు మా పద్దతుల్లో ప్రత్యర్థులను చిత్తు చేయాలని అనుకుంటాం.. కానీ అలా జరగదు.
కొన్ని సార్లు ఆలోచించి దీని కంటే బాగా ఆడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తాం.. కానీ అలాంటి వాటిని ముందుగా గుర్తించడం కష్టమే కానీ.. అవే గేమ్ ను నిర్దేశిస్తాయి" అని చెప్పుకొచ్చాడు. మేము యాషెష్ ను గెలవలేకపోచ్చు కానీ చివర్లో అత్యద్బుతంగా పుంజుకుని సిరీస్ 2-2 తో సమం చేశామని అన్నారు.
కాగా ఇంగ్లండ్ కోచ్ గా బజ్ బాల్ ప్రారంభించిన తరువాత ఆ జట్టు కోల్పోయిన తొలి సిరీస్ ఇదే. అందుకే వారి ఆటపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటీకి ఆ జట్టు తను అనుసరిస్తున్న బజ్ బాల్ ను విడవబోదని మెక్ కల్లమ్ వ్యాఖ్యలతో మరోసారి అర్థమైంది.


Read More
Next Story